రాష్ట్రీయం

యాదాద్రిలో గవర్నర్ పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరి గుట్ట , ఫిబ్రవరి 10: రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్. నరసింహన్ దంపతులు ఆదివారం వసంత పంచమి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు ఆలయ ఈవో ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బీ. నర్సింహ్మ మూర్తి, అయల అధికారులు, ప్రధానార్చకులు కారంపుడి నర్సింహ్మ చార్యులు, తాండూరి వెంకటాచార్యుల అర్చక బృందం మరియు వేద పండితులు ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో గవర్నర్ దంపతులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మహా మండపంలో అర్చకుల బృందం, వేద పండితుల బృందం, చతుర్వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఆశీర్వచనం అనంతరం ఈవో గీత, చైర్మన్ బీ. నర్సింహ్మ మూర్తి శ్రీ స్వామివారి ప్రసాదాలను ఆందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సుఖశాంతులతో ప్రజలు జీవించాలని, పాడి పంటలు వృద్ధి చెందాలని శ్రీ స్వామివారిని కోరుకున్నానని ఆయన తెలిపారు. నేను రాష్ట్ర ప్రథమ పౌరుడిని, ఈ ఆశీర్వచనం నాకు చేసినట్లుగా భావించకుండా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసినట్లుగా భావిస్తున్నాన్నారు. ఆయన వెంట యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునిత తదితరులున్నారు.