రాష్ట్రీయం

శ్రీ విద్యాధరి క్షేత్రంలో ఆధ్యాత్మిక వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఫిబ్రవరి 10: శ్రీ పంచమి మహోత్సవం సందర్భంగా ఆదివారం సిద్దిపేట జిల్లాలోని సుప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వైభవం సంతరించుకుంది. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం సందర్బంగా శ్రీ విద్యాధరి అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, లక్షపుష్పార్చణ, చండీ హోమం, చప్పన్‌బోగ్ నివేదన, శ్రీ విద్యాజ్యోతి దివ్యదర్శనం తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. జంటనగరాలతోపాటు తెలంగాణలోని ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో శంభూగిరి కొండలు భక్తజన సంద్రంగా మారగా, అమ్మవారి నామస్మరణతో ఆలయాల సముదాయం మార్మోగింది. సుమారు 50వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోగా, తమ చిన్నారులకు అక్షరస్వీకారాలు చేయించుకున్నారు. అయితే భక్తులు, పర్యాటకుల తాకిడి అదికంగా ఉండడంతో శ్రీ విద్యాధరి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండగా, వర్గల్ క్షేత్రానికి తెల్లవారుజామునుండే భక్తులు తరలిరావడం కనిపించింది. మొదటగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వం లో వేదపండితుల మంత్రోశ్చరణలు, భక్తజనుల జయజయ ధ్వనుల మధ్య శ్రీ పంచమి ఉత్సవానికి అంకురార్పణ చేశారు. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవిద్యాధరి, శ్రీలక్ష్మిగణపతి, శ్రీశనైశ్చరాలయం, శ్రీశంభు లింగేశ్వర ఆలయాలను నిర్వాహకులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా, నిర్వహించిన ధార్మిక, సాంస్కృతిక, సాహిత్య సంబరాలు భక్తులకు కనువిందు చేశాయి. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ వ్యిశంకర భారతీ స్వామి, శ్రీ రాంపూర్ పీఠాధిపతి మాదవానంద తీర్థ స్వామీజి, శ్రీ క్షేత్రం పీఠాధిపతి శ్రీ మదుసూదనానంద తీర్థ స్వామీజిలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహబాషణం చేశారు. అలాగే వివిద రంగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకరభారతీ తీర్థ, శ్రీ క్షేత్రం పీఠాధిపతి మదు సూదనానంద సరస్వతి తీర్థ స్వామీజిల చేతులమీదుగా జయపట్ట్భాషేకాలు అందజేయగా, భక్తులకు శ్రీ విద్యాధరి అమ్మవారు స్వర్ణకిరీటధారినై దర్శన భాగ్యం కల్పించారు.