రాష్ట్రీయం

చదువుల తల్లి కి భక్తుల నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర: నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి క్షేత్రానికి ఆదివారం వసంత శోభ సంతరించుకుంది. అమ్మవారి జన్మదినం మూలా నక్షత్రం పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస పూజలను జరిపించడానికి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు ఒకరోజు ముందుగానే బాసర క్షేత్రానికి తరలివచ్చారు. ఉదయం 10 గంటలకు ఆలయంలోని అమ్మవార్లకు ముధోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధుల చేతులమీదుగా మంగళవాయిద్యాలతో ఆలయంలోని అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.
అక్షర స్వీకార పూజలకు బారులుతీరిన భక్తులు.....
వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మవారి జన్మదినం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకారం పూజలు జరిపే చిన్నారులు ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. అమ్మవారి సన్నిధిలో అక్షరస్వీకార పూజలకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అమ్మవారి ఆలయంతోపాటు ఆలయ పరిసరాల భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున 4 గంటల నుండి అక్షరాభ్యాస పూజల కోసం చిన్నారులు భక్తులు క్యూలైన్‌లో బారులు తీరారు. ఆలయం నుండి వైశ్య సత్రం వరకు భక్తులు బారులుతీరారు. సుమారు కిలోమీటరుకు పైగా భక్తులు బారులుతీరారు. అమ్మవారి ప్రత్యేక అక్షరాభ్యాస మండపం, వంద రూపాయల అక్షరాభ్యాస మండపంలో తెల్లవారుజామున 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆలయ అర్చకులు నిరంతరాయంగా అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. సుమారు 4 వేల మంది చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు. ఆర్థిక సేవలు, లడ్డూ ప్రసాదాలు, అక్షరాభ్యాస పూజల ద్వారా ఆలయానికి ఒక్కరోజే రూ.25 లోలకు పైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం ఒక్కరోజే అమ్మవారి సన్నిధికి ఒక లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
భారీ బందోబస్తు....
ఉత్సవాను పురస్కరించుకుని నిర్మల్ జిల్లా ఏ ఎస్పీ దక్షిణామూర్తి ఆధ్వర్యంలో పోలీసులు బారీ బందోబస్తు నిర్వహించారు.