రాష్ట్రీయం

మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఉన్న కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ సీనియర్ నేత వేం నరేందర్‌రెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులు విచారణకు హాజరయ్యారు. ఓటుకు నోటు కేసులో స్టిఫెన్‌సన్‌కు ఇచ్చిన నగదు మనీలాండరింగ్ ద్వారా వచ్చిందన్న అభియోగంపై నరేందర్‌రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో ఆయన ఇద్దరు కొడుకులను కూడా విడవిడిగా విచారించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వేం నరేందర్‌రెడ్డి పోటీ చేశారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 10 గంటలకు పైగా ఈడీ అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణలో ప్రధానంగా నరేందర్‌రెడ్డి బ్యాంక్ లావాదేవీలతో పాటు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు నమోదు చేసిన కేసు వివరాలపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఓటుకు నోటు కేసులో తన కుమారులకు ఎలాంటి సంబంధ లేకున్నా వారిని విచారణకు ఈడీ అధికారులు పిలిపించడం పట్ల నరేందర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఈ కేసును ఈడీ అధికారులకు అప్పగించిందని ఆరోపించారు. రూ 50 లక్షలు ఎక్కడివన్న అంశాలు కోర్టులో తెలుస్తాయని ఆయన ఈడీ అధికారుల చెప్పారు. స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన రూ 50 లక్షలతో పాటు మిగతా రూ. 4.50 కోట్ల ఎక్కడి నుంచి మళ్ళిస్తారన్న అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నించారు. 2015లో తెలంగాణ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఓటుకు నోటు కేసు ఈడీ ఎదుట విచారణకు వచ్చింది. 2015 మే నెల 30 వ తేదీన అప్పటి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి స్టీఫెన్‌సన్‌కు( ఎమ్మెల్సీ అంగ్లో ఇండియన్) రూ 50 లక్షలు ఇవ్వచూపిన కేసులపై ఈడీ అధికారులు విచారిస్తున్నారు. స్టీఫెన్‌సన్‌కు నగదు ఇచ్చే సమయంలో రేవంత్‌రెడ్డితో పాటు వేం నరేందర్‌రెడ్డి ఉన్నట్లు అనిశా అధికారులు కేసు నమోదు చేశారు. కాగా వారం లోగా ఈడీ ఎదుట హాజరు కావాలని రేవంత్‌రెడ్డికి నోటీసులు మంగళవారం జారీ అయ్యాయి. ఇప్పటికే రేవంత్‌రెడ్డిపై ఆదాయపన్ను శాఖ అధికారులు పలుదఫాలుగా విచారణ చేపట్టారు. ఐటి అధికారులు రేవంత్‌రెడ్డి అన్నతో పాటు మామను విచారించారు. 2015లో శాసన మండలిలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 5 ఎమ్మెల్సీ స్థానాలను తెరాస కైవసం చేసుకోగా. ఒక స్థానం కోసం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడ్డాయి. ఒక స్థానం గెలుచుకోవడానకి అవసరమైన ఎమ్మెల్సీ మద్దత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు స్టీఫెన్‌సన్ వద్దకు రేవంత్‌రెడ్డిని పంపించారు. ఈ ఒప్పందాల్లో రూ 5 కోట్ల ఇవ్వడానికి టీడీపీ సిద్ధం కాగా తొలుతగా రూ 50 లక్షలు ఇవ్వడానికి స్టీఫెన్‌సన్ ఇంటికి రేవంత్‌రెడ్డి వెళ్ళారు. నగదు మార్పిడిలో జరిగిన స్టింగ్ ఆఫరేషన్‌లో ఏసీబీ అధికారులకు రేవంత్‌రెడ్డితో పాటు మిగతా నలుగురిపై కేసులు నమోదు చేశారు.

చిత్రం.. వేం నరేందర్‌రెడ్డి