రాష్ట్రీయం

రైతుకు రూ. 10వేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 13: అన్నదాత సుఖీభవ కింద రైతుకు 10 వేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి ప్రాథమికంగా నిర్ణయించింది. డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, ఏపీ వ్యవసాయ మండలి ఏర్పాటు, ఐఏఎస్‌లు, ఏన్జీవోలకు ఇళ్ల స్థలాలు తదితర నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర మంత్రి మండలి సమావేశం వెలగపూడి సచివాలయంలో బుధవారం ఉదయం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాకు వివరించారు.
* అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి 10 వేల రూపాయలు (కేంద్రం ఇచ్చేది కూడా కలిపి) చెల్లిస్తారు. ఖరీఫ్‌లో, రబీలో ఒక్కో సీజన్‌కు 5 వేల రూపాయలు చొప్పున చెల్లిస్తారు. కౌలు రైతులను కూడా ఖరీఫ్ నుంచి ఇచ్చి ఆదుకునేలా మార్గదర్శకాలు జారీ చేయనుంది. రాష్ట్రంలో 76.21 లక్షల కమతాలు ఉన్నాయి. 5 ఎకరాల కమతాలు ఉన్నవారు 60 లక్షల మంది ఉన్నారు. ఫిబ్రవరి చివరిలోనే ఇందుకు సంబంధించిన చెక్కుల పంపిణీ చేయనుంది. ఈ పథకం కింద 7621 కోట్ల రూపాయల మేర రైతులకు లబ్ధి చేకూరనుంది. కేంద్రం తన పథకంపై అనేక ఆంక్షలు పెట్టింది. 5 ఎకరాల లోపు వారికే కేంద్రం వర్తింప చేస్తుండగా, అదికూడా మూడు వాయిదాల్లో ఇస్తోంది. దీనికి భిన్నంగా రైతులందరికీ ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది.
* ప్రభుత్వ భూముల్లో 92,960 ఇళ్ల పట్టాలు, క్రమబద్ధీకరణ కింద మరో 5074 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనుంది.
* డ్వాక్రా మహిళలకు సిమ్ కార్డుతో సహా 3 ఏళ్ల కనెక్టివిటీ కలిగిన స్మార్ట్ ఫోన్లను ఇవ్వనుంది.
* వ్యవసాయ, ఉద్యాన వనాల విద్య క్రమబద్ధీకరణకు ఏపీ రాష్ట్ర వ్యవసాయ మండలిని ఏర్పాటు చేయనుంది. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని మండళ్ల తరహాలో ఈ మండలి ఏర్పాటు చేస్తారు. ఇకపై అగ్రికల్చర్, హార్టికల్చర్ ప్రాక్టీషనర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యవసాయ విద్యలో మరింత నాణ్యత తీసుకువచ్చేందుకు ఈ మండలి ఉపయోగపడనుంది. వ్యవసాయ విద్య డిగ్రీ పూర్తి చేసిన వారి సర్ట్ఫికెట్లను పరిశీలించి నకిలీ సర్ట్ఫికెట్లను ఏరివేసే కార్యక్రమం కూడా మండలికి అప్పగించనున్నారు.
* పంచాయతీల్లోని కంటింజెన్సీ ఉద్యోగుల జీతాల పెంపు
* 1998లో డీఎస్సీలో క్వాలిఫై అయిన 36 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్రాక్టు పద్ధతిలో నియమించనుంది. దీంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కరం కానుంది. 2008లో డీఎడ్, బీఎడ్ అర్హతల విషయంలో అనర్హులైన పెండింగ్‌లో ఉన్న వారికి కూడా కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకం
* 1983-96 మధ్య నియమితులైన స్పెషల్ టీచర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, భాషా పండితులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వనుంది.
* రాష్ట్రంలోని 22 ఆసుపత్రుల స్థాయిని పెంచనుంది.
* ఐఏఎస్ అధికారులకు, ఏన్జీవోలు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయించనుంది.
* శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ ఆధ్వర్యంలో 9 పశు సంవర్థక పాలిటెక్నిక్‌లు, 9 పిషరీస్ పాలిటెక్నిక్‌లను ఏర్పాటు చేయనుంది. ఒక్కో కళాశాలలో 50 సీట్లు ఉంటాయి. 2022 నాటికి నిపుణుల కొరత ఎక్కువ అయ్యే అవకాశం ఉండటంతో ఈ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం అవుతాయి.
* తిత్లీ, పెథాయ్ తుపాన్లలో నష్టపోయిన రైతులకు మిగిలిన పెండింగ్ మొత్తాలను వెంటనే ఇవ్వనుంది
* భోగాపురం విమానాశ్రయానికి భూములు ఇచ్చిన వారికి ఇవ్వాల్సిన దాంట్లో మిగిలిన 5 లక్షల రూపాయలు కూడా చెల్లింపు. ఇందుకు 35 కోట్ల రూపాయలు కేటాయింపు.
* బీసీ(బీ)లో ఉన్న వక్కలిక/కుంచటిగ సామాజిక వర్గం చిత్తూరు జిల్లాలో ఉన్న వారికి కూడా రిజర్వేషన్ వర్తింప చేయనుంది. రాష్ట్రంలో 5 లక్షల మంది ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఎక్కువ మంది మడకశిర ప్రాంతంలో ఉన్నారు.
* ఇప్పటి వరకూ పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న లిడ్‌క్యాప్ ఇకపై సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోకి తీసుకువచ్చారు.
* 78 మంది ఫుడ్ ఇన్స్‌పెక్టరు పోస్టులు, 28 శాంప్లింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయనుంది.
* సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్‌కు రాజధాని అమరావతి వెలుపల 10 ఎకరాలు కేటాయింపు
* తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 17.17 ఎకరాలను, విజయనగరం జిల్లా మారుపల్లిలో 80 ఎకరాలను ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయింపు
* చిత్తూరు జిల్లా కొటఊరు, బయ్యప్పగారి పల్లెలో హార్టికల్చర్ రీసెర్చి స్టేషన్ ఏర్పాటు వీలుగా వైఎస్‌ఆర్ ఉద్యాన వర్సిటీకి 88.89 ఎకరాల కేటాయింపు
* కర్నూల్ జిల్లా ఓర్వకల్లులో గృహ నిర్మాణానికి వీలుగా కుడాకు 56.94 ఎకరాలు కేటాయింపు
* చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏపీ ఎయిర్‌పోర్ట్సు డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు 496 ఎకరాలను ముందస్తు స్వాధీనం చేసింది.

చిత్రం..మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న నాయకులు *( ఇన్‌సెట్‌లో) సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు