రాష్ట్రీయం

మన విద్యార్థులకు అమెరికా కోర్టులో ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: అమెరికా ఫర్మింగ్టన్ నకిలీ యూనివర్శిటీలో చేరి వీసా నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణలపై అమెరికా హోం ల్యాండ్ పోలీసుల అదుపులో ఉన్న భారతీయ విద్యార్థులు మరీ ముఖ్యంగా తెలుగు వారికి ఊరట లభించింది. స్వచ్ఛందంగా అమెరికా విడిచి స్వదేశానికి వెళ్లిపోయేందుకు ఫిబ్రవరి 26 వరకూ అక్కడి కోర్టులు అనుమతి మంజూరు చేశాయి. 20 మంది విద్యార్థుల్లో ముందుగానే వాలంటరీ డిపార్చర్ -స్వచ్ఛందంగా స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు ముందుగా ముగ్గురికి అనుమతి లభించింది. వారిలో ఇద్దరు భారతీయులు కాగా, మరొకరు పాలస్తీనాకు చెందిన వారు. ఫర్మింగ్టన్ నకిలీ యూనివర్శిటీ కేసులో అరెస్టు అయిన విద్యార్థుల ఫైనల్ హియరింగ్ ఫిబ్రవరి 12న జరిగింది. కేలహౌన్ కౌంటీ జైలులోని 12 మంది, మన్రో కౌంటీ జైలులోని 8 మంది కలిపి మొత్తం 20 మంది విద్యార్థులపై విచారణ కొనసాగింది. వీరిలో ముగ్గురికి ముందే స్వదేశాలకు వెళ్లిపోయేందుకు అనుమతి లభించింది. మిగిలిన 17 మందిపై మంగళవారం నాడు విచారణ జరిగింది. 17 మందిలో 15 మందికి వాలంటరీ డిపార్చర్ అవకాశాన్ని కోర్టు కల్పించింది. ఈ 15 మందిలో 8మంది తెలుగు విద్యార్థులే. 16వ విద్యార్థికి కూడా తిరిగి వెళ్లిపోయే అవకాశం కల్పించింది. కానీ స్వచ్ఛందంగా కాకుండా యూఎస్ ప్రభుత్వ రిమొవల్ కింద వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. 17వ విద్యార్థి యూఎస్ సిటిజన్‌ను వివాహం చేసుకున్నాడు. అందుకు అతను బెయిల్ బాండ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మొత్తం 16 మంది విద్యార్థులు కోర్టు జడ్జిమెంట్ మేరకు వాలంటరీగా ఫిబ్రవరి 26లోగా అమెరికాను విడిచి వెళ్లాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాల మేరకు విద్యార్థులు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. వారి తిరుగు ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు విషయంలో సహకరించాలని ఇమిగ్రేషన్ అధికారులను అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. దీనిపై ఇమిగ్రేషన్ అధికారులు సానుకూలంగా స్పందించారు. విద్యార్థులు తిరుగు ప్రయాణానికి టిక్కెట్ బుకింగ్ టైమింగ్, జైలు ఇమిగ్రేషన్ అధికారులకు విద్యార్థులు ముందే తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జైలు ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను జైలు నుండి ఎయిర్‌పోర్టుకు చేర్చే ఏర్పాట్లు చేస్తారు. ఫర్మింగ్టన్ ఫేక్ యూనివర్శిటీ కేసులో అరెస్టయిన విద్యార్థులకు పూర్తిగా అండగా నిలుస్తామని అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. విద్యార్థుల తరఫున వాదించేందుకు అటార్నీలను కూడా ఆటా తెలంగాణ ప్రతినిధులు ఏర్పాటు చేశారు. విచారణ ఎదుర్కొంటున్న విద్యార్థులకు సహకారం అందించాలంటూ కాంగ్రెస్ ఉమెన్ ఎలిసా స్లాటికిన్‌కు వెంకట్ మంతెన ఆధ్వర్యంలోని ఆటా బృందం కోరింది. ఈ మేరకు స్పందించిన ఎలీసా స్లాటికిన్ అటు హోం ల్యాండ్ అధికారులను, ఇమిగ్రేషన్ అధికారులను కూడా ఈ సమస్యలపై నిలదీసి సమాచారం కోరారు.