రాష్ట్రీయం

దార్శనికురాలు ఈశ్వరీబాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: పేదల పెన్నిది, సమాజంలో అసమానతలు దూరం చేసేందుకు పోరాటం చేసిన మహానీయురాలు జే ఈశ్వరీబాయి పేరిట పోస్టల్ స్టాంప్ విడుదల చేసేలా కృషి చేస్తానని చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ (తెలంగాణ సర్కిల్) బ్రిగేడియర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈశ్వరీబాయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నగరంలోని తెలుగు విశ్వ విద్యాలయం ఆవరణలోని ఎన్టీఆర్ హాలులో ఏర్పాటైన కార్యక్రమంలో బ్రిగేడియర్ చంద్రశేఖర్ ఈశ్వరీబాయి పేరిట పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు. ఈశ్వరీబాయి పేరిట పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. టీచర్ స్థాయి నుంచి ఒక పార్టీకి అధ్యక్షురాలిగా, ఎమ్మెల్యేగా ఎదిగి మహిళల హక్కుల కోసం పోరాటం చేసిన ఈశ్వరిబాయిని స్మరించకోవడం గర్వకారణం అని అన్నారు. హైదరాబాద్ ప్రాంతీయ సర్కిల్ పోస్టు మాస్టర్ జనరల్ రాధికా చక్రవర్తి ప్రసంగిస్తూ ఈశ్వరీబాయి ఆంధ్ర, తెలంగాణలకే కాకుండా దేశానికి విశేషంగా సేవలందించారని అన్నారు. మహిళలు విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి కృషి చేశారని ఆమె కొనియాడారు. ఏ దేశమైనా మహిళలను మహిళలను గౌరవించినప్పుడే పురోగతి సాధిస్తుందన్నారు. ఆమె ప్రమాభిమానాలకు ప్రతీక అని రాధికా చక్రవర్తి తెలిపారు. ఈశ్వరీబాయి శతజయంతి ఉత్సవాలని పురస్కరించుకుని ఇటీవల కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్‌పీ) నేతగా ఎన్నికైన భట్టివిక్రమార్కను ఈశ్వరీబాయి ట్రస్టు చైర్‌పర్సన్, ఆమె కుమార్తె కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి డాక్టర్ జే గీతారెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క ప్రసంగిస్తూ ఈశ్వరీబాయి పేరిట పోస్టల్ కవర్‌ను విడుదల చేయడం పట్ల పోస్టల్ శాఖ పోస్టు మాస్టర్ జనరల్‌ను అభినందించారు. ఈశ్వరీబాయి సమానత్వం కోసం పోరాటం చేశారని అన్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో సర్పంచ్‌గా ఎన్నికైన ఒక మహిళలను గ్రామ పంచాయతీ జనరల్‌బాడీ సమావేశంలో కింద కూర్చోబెట్టారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈశ్వరీబాయి ధైర్యానికి, శక్తికి తాను తల వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. హైదరాబాద్‌లో కార్పోరేటర్ స్థాయి నుంచి ఆమె ఎదిగారని ఆయన చెప్పారు. అంబేద్కర్ సభకు ఇక్కడి నుంచి ప్రతినిధిగా వెళ్ళారని, బాబూ జగ్జీవన్ రాంతో పని చేశారని ఆయన తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 294 మంది ఎమ్మెల్యేలలో ధైర్యంగా తాను చెప్పదలచుకున్నది చెప్పేవారని అన్నారు. వెనుకబడిన తెలంగాణ కోసం తన అవసరం ఉందని ఈశ్వరీబాయి పోరాటం చేశారని భట్టివిక్రమార్క చెప్పారు. డాక్టర్ జే. గీతారెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ రాజకీయాల్లో నైతిక విలువలు దిగజారుతున్నాయని ఆవేదన చెందారు. తాను ఈశ్వరీబాయి కుమార్తె కావడం గర్వకారణమని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో డాక్టర్ గీతారెడ్డి భర్త డాక్టర్ రామచంద్రారెడ్డి, భట్టివిక్రమార్క సతీమణి నందిని తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. పోస్టల్ కవర్ విడుదల చేస్తున్న డా. రామచంద్రారెడ్డి, రాధికా చక్రవర్తి, చంద్రశేఖర్, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, నందిని