రాష్ట్రీయం

బంపర్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ సంస్థ, జాగృతి ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 16న జాబ్‌మేళాను నిర్వహిస్తోందని ఆ సంస్థ ప్రతినిధి వంశీ ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంపేటలోని హైదర్‌నగర్‌లోని సంస్థ కార్యాలయానికి ఉద్యోగార్థులు హాజరు కావాలని ఆయన సూచించారు. నెల్లూరు జిల్లా తడ వద్ద ఉదన్న శ్రీసిటీలోని ప్రముఖ మొబైల్ తంయారీ సంస్థలో పనిచేయడానికి అనుభవం ఉన్న 100 మంది టెక్నీషియన్లు, ఇంజనీర్లను ఈ జాబ్‌మేళాలో ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. మొబైల్ ఫోన్లలో సమస్యలను గుర్తించడంతో పాటు మొబైల్ , ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ సెట్ టాప్ బాక్స్‌లోని పీసీబీఏ బోర్డు రిపేర్ చేసే అనుభవం ఉన్న టెక్నీషియన్లు దీనికి హాజరు కావచ్చని అన్నారు. అంతేగాక, డయాగ్నస్టిక్ టెక్నీషియన్లు, మొబైల్ సర్వీసు ఇంజనీర్లు, మొబైల్ రిపేర్, బీజీఏ రీవర్కు, ఎల్ 4 వర్కు చేసే వారు కూడా హాజరుకావచ్చని చెప్పారు. డిప్లొమో, ఇంజనీరింగ్, పదోతరగతి, లేదా ఏదైనా డిగ్రీ పాసైన వారు బయోడేటా సర్ట్ఫికేట్లు, ఆధార్, పాస్‌పోర్టు సైజ్ ఫోటోలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని, అనుభవం ఆధారంగా వేతనం, పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉచిత రవాణా సదుపాయాలు ఉంటాయని అన్నారు. ఇతర వివరాలకు 9705203434 నెంబర్‌లో సంప్రదించవచ్చని చెప్పారు.