రాష్ట్రీయం

జగన్‌ను కలిసిన చీరాల ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని హైదరాబాదులోని లోటస్‌పాండ్‌లో కలుసుకున్నారు. దీంతో ఆమంచి వైసీపీలో చేరటం లాంఛనమేనని చెప్పవచ్చు. తాను తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసినట్లు ఆమంచి ప్రకటించారు. రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పంపించారు. చీరాల నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాల్లో పార్టీకి, ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధంలేని కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కాలంలోముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అమరావతిలో కలిసిన సందర్భంలో త్వరలో తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. అనంతరం చీరాల నియోజకవర్గంలోని తన అనుచరులతో చర్చించిన మీదట వైసీపీ గూటికి చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జగన్‌ను కలిసి తన మద్దతు ప్రకటించారు. ముందుగా తన రాజకీయ గురువు, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో రాజకీయాలపై చర్చించినట్లు పార్టీవర్గాల సమాచారం. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్రంగా విమర్శించినట్లు తెలిసింది. జగన్ జిల్లాపర్యటన సందర్భంగా ఆయన అధికారికంగా వైసీపీలో చేరే అవకాశాలున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇదిలా ఉండగా ఆమంచి రాకను వ్యతిరేకిస్తూ ఇటీవలకాలంలో వైకాపాలోని కొంతమంది నేతలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా ఆమంచి టీడీపీని వీడి వైకాపాలో చేరేందుకు నిర్ణయం తీసుకోవటంతో వారందరూ రానున్న ఎన్నికల్లో ఆమంచికి మద్దతుగా నిలుస్తారా, లేక వేరే కుంపటి పెడతారా అని చర్చ సాగుతోంది.
కాగా ఆమంచి వ్యవహరం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చీరాల నియోజకవర్గంలోని తెలుగుతమ్ముళ్ల పరిస్థితి ప్రస్తుతానికి చుక్కాని లేని నావలా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో చీరాల నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ కరణం బలరాంను నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
చిత్రం.. హైదరాబాద్‌లో ఆయన నివాసంలో వైకాపా అధినేత వైఎస్ జగన్‌ను కలిసి
పుప్పగుచ్ఛం అందచేస్తున్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్