రాష్ట్రీయం

ఏపీలో పాలన గాడి తప్పింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 14: ఆంధ్రప్రదేశ్‌లో పాలన గాడి తప్పిందని, వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, ప్రస్తుత చంద్రబాబు పాలనకు ముగింపు పలికేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో బలహీన వర్గాలకు వేసిన కార్పొరేషన్లకు నిధుల కేటాయింపులు ఎక్కడని ప్రశ్నించారు. విజయవాడకు వచ్చిన తలసాని గురువారం ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో బిసి సంఘాలు బలంగా ఉన్నాయని, ఎస్పీ, ఎస్టీ, బలహీన, మైనార్టీ వర్గాలను చైతన్య పరిచే ప్రక్రియలో భాగంగా మార్చి 3వ తేదీన గుంటూరులో యాదవ, బీసీ గర్జన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజమండ్రి, ద్రాక్షారామం వెళ్లి తిరిగి వస్తూ గుంటూరు జిల్లా హాయ్‌ల్యాండ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తే పోలీసులు అడ్డుకున్నారని, ఇంటిలిజెన్స్ నుంచి ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. నగరంలో ప్రెస్‌మీట్ పెడుతున్న హోటల్ యాజమాన్యంపై కూడా ఒత్తిడి తీసుకురావడం దారుణమన్నారు. ఏపీలో పాలన దారుణంగా ఉందన్నారు. తనకు ఇక్కడ అభిమానులు, స్నేహితులు, బంధువులు ఉన్నారని, తనను కలిసేందుకు వచ్చిన వారిని పార్టీనుండి తొలిగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. తెలుగుదేశం నుంచి పలువురు నాయకులు బయటకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏపీలో 16వేల కోట్లు రెవిన్యూ లోటు ఉందని చెబుతున్న చంద్రబాబు ప్రజాధనం భారీగా దుర్వినియోగం చేయడం పట్ల సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల తాయిలాలు విపరీతంగా ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు ఇస్తామని చెప్పిన పదివేల రూపాయల నజరానాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు.
దీనిపై కేంద్రం ఇంకా గైడ్‌లెన్స్ ఇవ్వలేదన్నారు. మరోవైపు రిజర్వేషన్ల పేరుతో ఏపీ ప్రభుత్వం కాపులను మోసం చేస్తోందని, పసుపు-కుంకుమ కూడా బోగస్ అని ఆరోపించారు. బీసీలను అన్ని విధాల అణిచివేశారని, అందుకే యాదవులు, బీసీలు ఏకం కావలని పిలుపునిచ్చారు. కేంద్రంపై హోదా పోరాటమంటున్న చంద్రబాబు ప్రజాధనంలో ధర్మదీక్షలు చేస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని దీక్షలకు ఎలా వినియోగిస్తారని ప్రశ్నించారు. ఒక ప్రభుత్వ విభాగంలో 37మంది ఒకే సామాజిక వర్గం వారికే పదోన్నతులు ఎలా ఇస్తారని నిలదీశారు. కాంగ్రెస్ అరాచకాలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం ఏర్పాటు చేస్తే అదే పార్టీని నేడు చంద్రబాబు రాహుల్ గాంధీ కాళ్ళ వద్ద పెట్టారని అన్నారు. ఏపీ సమస్యలపై టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తోందని, పార్లమెంటులో కూడా తాము ఏపీకి న్యాయం జరగాలని కోరామన్నారు. బీసీలను ఏకం చేసేందుకు తాను ఏపీలో రాజకీయం చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో పారదర్శక పాలన, అభివృద్ధి కొనసాగుతోందని వివరించారు.