రాష్ట్రీయం

కుట్రలు, ప్రలోభాలే వాళ్ల రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రం కోసం పోరాడుతున్న తనపై దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారని, కుట్రలు, కుతంత్రాలు, బెదిరింపులే వాళ్ల రాజకీయం అంటూ బీజేపీ, వైకాపా, తెరాసలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఎలక్షన్ మిషన్ 2019లో భాగంగా టీడీపీ నేతలు, బాధ్యులు, ప్రజాప్రతినిధులతో ఆయన గురువారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 కోట్ల ప్రజల హక్కుల కోసమే ధర్మపోరాటమన్నారు. ఆ మూడు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. అవకాశవాదులకు పార్టీలో స్థానం లేదని స్పష్టం చేశారు. కొందరు పోతే నష్టాల కన్నా లాభాలే ఎక్కువగా ఉంటాయన్నారు. నాయకులు రావడం, పోవడం మామూలేనని వ్యాఖ్యానించారు. కానీ కార్యకర్తలే పార్టీని కాపాడుకుంటారన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆశయం కోసం పని చేసేది కార్యకర్తలేనని, తనపై కులం ముద్ర వేయాలని చూడటం బాధాకరమన్నారు. విద్యార్థి దశ నుంచి తనను గౌరవించింది ఇతర కులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటీలేనన్నారు. కాపులకు రిజర్వేషన్లని చెప్పి మోసగించింది వైఎస్ అని, కాపు రిజర్వేషన్లపై తనకు సంబంధం లేదని చెప్పింది జగన్ అని గుర్తు చేశారు. కాపులకు ఏడాదికి 1000 కోట్ల రూపాయలు కేటాయించామని, ఈబీసీ రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్ కాపులకే ఇచ్చామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంది టీడీపీ అని, కులాలను రెచ్చగొట్టే కుట్ర వైకాపా చేస్తోందన్నారు. ఏపీకి హోదా కోసం చిదంబరం కమిటీ సిఫారసు చేసిందన్నారు. హోదా ఇవ్వాలని హోం పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. ఏపీకి హోదాపైనే తొలి సంతకం అని రాహుల్ చెప్పారన్నారు. వీటిపై జగన్ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. హోదా ఇస్తామన్న వారిని విమర్శిస్తారని, హోదా ఎగ్గొట్టిన మోదీపై నోరు తెరవరని ఎద్దేవా చేశారు. ఏపీకి 22 పార్టీలు మద్దతు ఇస్తే, వైకాపా స్వాగతించదని, కేసీఆర్‌తో కలిసి కుట్రలు చేస్తారని విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ అని డ్రామాలు ఆడుతున్నారని, గత 5 ఏళ్లుగా హైదరాబాద్ వదిలి రాలేదని, వీటన్నింటిపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. కసి, పట్టుదల ప్రజల్లో పెరగాలని, కుట్రదారులకు బుద్ధి చెప్పాలన్నారు. టీడీపీ ధర్మ పోరాటానికి అండగా ఉండాలని, అన్ని సీట్లలో టీడీపీ గెలుపు ఏకపక్షం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అన్నదాత సుఖీభవ పథకం ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు. కౌలు రైతులకు ఇచ్చేందుకు కూడా మార్గదర్శకాలు ఇస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చిన సాయంలో అనేక ఆంక్షలు ఉన్నాయని, ఏపీలో మాత్రం రైతులందరికీ ఇస్తున్నామన్నారు. పింఛన్లు, పసుపు కుంకుమ, రైతుకుటుంబానికి 10 వేల రూపాయల పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. పెద్దకొడుకుగా ఉంటానన్న మాట నిలబెట్టుకున్నామన్నారు. ఏకపక్ష ఎన్నికకు ఇదొక అవకాశమన్నారు. ఎన్నో కష్టాల్లో కూడా ఇన్ని కార్యక్రమాలు ఏపీలోనే జరిగాయన్నారు. వైకుంఠపురం బ్యారేజీకి శంకుస్థాపన చేశామని, దీంతో ప్రకాశం బ్యారేజీకి అటూ ఇటూ 100 కిలోమీటర్ల మేర జలకళ వస్తుందన్నారు. రాజధాని అమరావతికి నీటి కొరత రాదన్నారు. 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో విశాఖలో డేటా సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయని, డేటా నాలెడ్జిలో వర్జీనియాకు దీటుగా విశాఖ అభివృద్ధి చెందుతుందన్నారు. ఢిల్లీలో 12 గంటల దీక్ష, తరువాత పాదయాత్ర, కేజ్రీవాల్ దీక్షలో పాల్గొనాన్నని తెలిపారు. ఒకవైపు రాష్ట్రంలో అభవృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా, మరోవైపు ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణకు నిరంతరం శ్రమపడుతున్నానన్నారు. ఇది పార్టీ వర్గాలు ఇచ్చిన ప్రోత్సాహమేనని తెలిపారు. ఢిల్లీలో కేజ్రీవాల్ దీక్షకు మంచి స్పందన వచ్చిందని, మోదీ పాలనపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఉందన్నారు. జాతీయ పార్టీలతో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయన్నారు. ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుంటామని, కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రకారం పని చేస్తామన్నారు. ఈవీఎంలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు.