రాష్ట్రీయం

మళ్లీ ప్రత్యక్షమైన చిరుత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముమ్మిడివరం: తూర్పు గోదావరి జిల్లా కోనసీమ వాసులను చిరుత భయం వీడటంలేదు. ఇటీవలే ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో ఒక చిరుత నలుగురిని గాయపరచి, కొబ్బరిచెట్టుపై మకాంవేసి మాయమైన సంగతి విదితమే. తాజాగా కోనసీమలోని ముమ్మిడివరం మండలం బలుసుల్లంక గ్రామంలో గురువారం ఒక చిరుత ప్రత్యక్షమయ్యింది. ముగ్గురిని గాయపరిచి, ఒక తాటాకింట్లోకి వెళ్లిన చిరుత, తలుపులు మూసేయడంతో అక్కడే ఉంది. అయితే దాన్ని మత్తు ఇంజక్షను ఇచ్చి, సురక్షితంగా బంధించడానికి అటవీ శాఖాధికారులు చేసిన ప్రయత్నం ఒకసారి విఫలమయ్యింది. దీనితో మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఇది గతంలో అంకంపాలెంలో తప్పించుకున్న చిరుతేనా లేక మరోటా అనేది తెలియరాలేదు. వివరాలిలావున్నాయి... ముమ్మిడివరం మండలం ఠాణేలంక పంచాయతీ పరిధిలోని బలుసుల్లంకలో గురువారం తెల్లవారుజామున 5, 6 గంటల సమయంలో గేదెల్లంక పరిసర ప్రాంతాల్లో తోటకు నీరుపెడుతున్న రైతులకు చిరుత కనిపించింది. అనంతరం అది అరటి తోటలో నక్కింది. ఆ సమయంలో బలుసుల్లంక గ్రామానికి చెందిన చిన్నం శ్రీనివాసరావు, చీకురమెల్లి నాగేశ్వరరావు, పితాని సూరిబాబులు ఆ ప్రాంతానికి బహిర్భూమికి వెళ్ళారు. దీంతో చిరుత ఒక్కసారిగా వారిపై దాడిచేసింది. భయంతో వారు కేకలు చుట్టుపక్కల వారు కర్రలు, కత్తులు రాళ్ళతో అక్కడకు రావడంతో చిరుత పరుగుతీసింది. వారంతా వెంబడించడంతో తొలుత కొబ్బరి చెట్టు ఎక్కడానికి ప్రయత్నించిన చిరుత మళ్లీ కిందకు దిగి, గుత్తుల రామారావు అనే వ్యక్తి తాటాకు ఇంట్లోకి ప్రవేశించి, అటకపైకి ఎక్కింది. ఆ సమయంలో వంట చేస్తున్న రామారావు భార్య మాచరమ్మను చిరుతను వెంబడిస్తూ వచ్చిన వారు హెచ్చరించడంతో ఆమె ఇంటి నుండి బయటకు వచ్చేసింది. ఇంటి తలుపులు మూసివేసి, బయట గొళ్లెం పెట్టడంతో చిరుత ఇంట్లోనే ఉండిపోయింది. సమాచారం అందుకున్న ముమ్మిడివరం ఎస్సై ఎమ్‌వివి రవీంద్రబాబు, తహసీల్దార్ ఎవి రామాంజనేయులు, ఫైర్ ఆఫీసర్ ఎ నాగేశ్వరరావు, పలు ఇతర శాఖల అధికారులు బలుసుల్లంక చేరుకున్నారు. మత్యకారులు వేటకు ఉపయోగించే వలలను చిరుత దాగి ఉన్న ఇంటి చుట్టూ కట్టారు. సమాచారం అందుకున్న డీఎఫ్‌వో నంద నీ సలారియా, వన్యమృగ సంరక్షణ అధికారి అనంతశంకర్, కాట్రేనికోన మండలం కందికుప్ప అటవీశాఖ అధికారి టి సత్యనారాయణ, 25మంది సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో విశాఖ నుండి వచ్చిన అప్పలనాయుడు అనే జూఅధికారి కొందరు సిబ్బందితో కలి సి మత్తు ఇంజక్షన్ ఇవ్వడానికి ఇంటి పైకప్పు ఎక్కారు. మత్తు ఇంజక్షన్‌ను ప్రత్యేక గన్‌తో ప్రయోగించినా, పనిచేయలేదు. దీనితో చిరుత వారిపై దాడికి ప్రయత్నించడంతో వారు భయాందోళనకు గురై పైకప్పునుంచి జారి నేలపై పడిపోవడంతో సిబ్బందిలో ఇద్దరికి స్వల్పగాయాయ్యాయి. ఇంటిలో దాగివున్న చిరుతను బంధించడానికి అటవీశాఖ అధికార్లు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సంఘటనా స్దలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
చిత్రం.. అరటి తోటలో ప్రత్యక్షమైన చిరుత