రాష్ట్రీయం

రోజుకో మలుపు?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ఎన్నారై, పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్యపై జరుగుతున్న దర్యాప్తులో సంచలనాత్మక అంశాలు వెలుగు చూస్తున్నాయి. జయరాం హత్య కేసులో రాకేష్‌రెడ్డితో పాటు రౌడీ షీటర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. హత్య వెనక రాజకీయ ప్రమేయాన్ని కూడా దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. రాకేష్‌రెడ్డితో పాటు హైదరాబాద్‌కు చెందిన రౌడీ షీటర్ నగేశ్ కీలక పాత్ర పోషించాడని విచారణలో బయట పడింది. జయరాంను ఉచ్చులోకి చేయడానికి అమ్మాయి పేరుతో వాట్సాప్ చాటింగ్ చేసినట్టు తెలిసింది. జయరాం నుంచి రాకేష్‌రెడ్డి బలవంతంగా ఖాళీ బాండ్లు, దస్తావేజీలపై సంతకాలు చేయించాడని తేలింది. ఇదే కేసులో సిరిసిల్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంజిరెడ్డి, చొక్కారామ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్ వద్ద రాకేష్‌రెడ్డి కోటీ 50 లక్ష ల రూపాయలు అప్పుగా తీసుకున్నారని విచారణలో వెల్లడైంది. బాకీ కోసం అడిగితే పోలీస్ అధికారులు, రాజకీయ నేతల పేర్లు చెప్పి రాకేష్‌రెడ్డి బెదిరించేవాడని రాజ్‌కుమార్ వెల్లడించాడు. ఎన్నారై జయరాంకు
అప్పు ఇచ్చేటంత స్థాయి రాకేష్‌రెడ్డికి లేదని అంటున్నారు. పైగా డబ్బులు అడిగితే చెల్లిని చెక్కులు ఇచ్చి మోసం చేసేవాడని దర్యాప్తులో వెల్లడైంది. కాగా జయరాం హత్య తరువాత రాకేష్‌రెడ్డి పోలీసు అధికారులతో ఏం మాట్లాడాడు అన్నదానిపై దృష్టిపెట్టిన అధికారులు అతడి సెల్‌ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనమైన ఈ హత్యకేసులో ఇప్పటికే ఒక ఏసీపీ, సీఐపై బదిలీ వేటు పడింది. మరో తొమ్మిది మందిపై వేటు పడనుందని తెలిసింది. అందులో ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు ఉన్నారు. కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారులపై బదిలీ వేటువేయడానకి ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డికి పోలీస్ అధికారులు సహకరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. జయరాం హత్యకు ఆర్థిక అంశాలే ప్రధాన కారణమని ఇప్పటి వరకూ భావిస్తుండగా తాజా విచారణలో అనేక కొత్త అంశాలు తెరమీదకు వస్తున్నాయి. జయరాంకు ఒక్కపైసా కూడా రాకేష్‌రెడ్డి అప్పు ఇవ్వలేదని విచారణలో తేలింది. దీంతో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. జయరాం హత్యకేసులో తనకు 11 మంది పోలీస్ అధికారులు సహకరించారని రాకేష్‌రెడ్డి విచారణలో వెల్లడించాడు. మరోపక్క జయరాం మేనకోడలు శిఖా చౌదరిని గురువారం ఇంటరాగేట్ చేశారు. జయరాంతో పరిచయం కాక ముందు తర్వాత శిఖాచౌదరి ఆస్తులు ఎంత అన్నదానిపై దృష్టి సారించారు. శిఖాచౌదరి ఖరీదైన భవనాలతో పాటు ఆమె వ్యవహార శైలిపైనా విచారణ సాగుతోంది. అలాగే ఫొరెన్సిక్ అధికారులు రాకేష్‌రెడ్డి ఇంట్లో అణవణువూ పరిశీలించారు. నకిలీ దస్తావేజీలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సినీ నటుడు సూర్యను విచారిస్తున్నారు. జయరాంకు సూర్యే అమ్మాయిల ఎరవేసినట్టు చెబుతున్నారు.

చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న శిఖా చౌదరి