రాష్ట్రీయం

22నుంచి 25 వరకు బడ్జెట్ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఈ నెల 22న ‘ఓట్ ఆన్ అకౌంట్’ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 22 నుండి 25 వరకు జరుగుతాయని ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం రాత్రి వెల్లడించింది. ఫిబ్రవరి 22న ఓట్ ఆన్ అకౌంట్ ప్రతిపాదించి 23, 24 తేదీల్లో చర్చకు సభ్యులకు అవకాశం ఇస్తారు. 25న ద్రవ్య వినిమయ బిల్లును ప్రతిపాదించి, శాసనసభ ఆమోదం తీసుకుంటారు. నాలుగు రోజుల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముగించనున్నారు. సాధారణంగా అయితే బడ్జెట్ సమావేశాలు 40 రోజుల పాటు (సెలవులు కూడా కలిపి) జరుగుతాయి. ఫిబ్రవరి మధ్య నుండి మార్చి 31 వరకు వరకు బడ్జెట్ సమావేశాలను గతంలో నిర్వహించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ఏయే రంగాలకు ఎంత మేరకు నిధులు వస్తాయో స్పష్టం కాకపోవడం, కేంద్ర ప్రభుత్వం కూడా ‘ఓట్ ఆన్ అకౌంట్’ ప్రతిపాదించడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెగ్యులర్ బడ్జెట్‌ను ప్రతిపాదించడం లేదు. ఈ విషయం గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా వెల్లడించారు. కేంద్రం నుండి లభించే నిధులపై స్పష్టత ఉంటేనే, దానికి అనుగుణంగా వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించేందుకు వీలవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రతిపాదించేందుకు వీలుకాకపోవడం వల్ల ఓట్ ఆన్ అకౌంట్‌కే కేసీఆర్ మొగ్గు చూపారు. ఓట్ ఆన్ అకౌంట్ ఈ నెల 22న ప్రతిపాదించడం వల్ల మరోకు రెండు, మూడు నెలల వరకు ప్రభుత్వం రోజువారీ ఖర్చులకు చట్టపరంగా ఎలాంటి చిక్కులు ఉండవు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని అధికార వర్గాలు వివరించాయి.