రాష్ట్రీయం

రేపు లేదా ఎల్లుండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ 16 లేదా 17న ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బడ్జెట్ సమావేశాలు 22 నుండి 25 వరకు జరుగుతుండటం, ‘ఓట్ ఆన్ అకౌంట్’ను 22న ప్రవేశపెడుతున్నందున ఈలోగా ఆర్థిక మంత్రి ఎవరో తేలాల్సి ఉంది. ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగానే 22 లోగా తెలుగు క్యాలెండర్ ప్రకారం చూస్తే కొన్ని వాస్తవాలు వెల్లడవుతున్నాయి. ఫిబ్రవరి 15 దశమి అవుతుంది. చాలా మంచిరోజే అయినప్పటికీ, సమయం లేకపోవడం వల్ల శుక్రవారం మంత్రివర్గ విస్తరణకు అవకాశం లేదని తెలుస్తోంది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లకు రాజ్‌భవన్‌కు కనీసం 48 గంటలు అవసరం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. సౌండ్ సిస్టం ఏర్పాటు బాధ్యత సమాచార, పౌరసంబంధాల శాఖ చూస్తుంది. ఈ శాఖ అధికారులకు గురువారం రాత్రివరకు ఎలాంటి సమాచారం అందలేదు.
16 శనివారం ఏకాదశి. ఉదయం 11 గంటల వరకు ఏకాదశి ఉంటుంది. ఆ తర్వాత ద్వాదశి వస్తుంది. శనివారం రోజు ఏకాదశి, ద్వాదశి కలిసి వస్తున్నాయి. శనివారం రోజు ముఖ్యమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యక్తిగతంగా ఇష్టం లేదని తెలిసింది. ఆదివారం త్రయోదశి అవుతుంది, ఆ ఒక్క రోజే మిగతా అన్ని రోజుల కన్నా మంచిరోజుగా ఉంది. సోమవారం తర్వాత ఫిబ్రవరి 21 వరకు తెలుగు క్యాలెండర్ ప్రకారం పెద్దగా మంచి రోజులు లేవు. అంటే శుక్రవారం నుండి ఈ నెల 22 వరకు పరిశీలిస్తే ఆదివారం మినహా మిగతా రోజులు పెద్దగా ఉత్తమంగా లేవని పండితులు చెబుతున్నారు. ఆర్థిక మంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేసినా, బడ్జెట్ రూపకల్పన, అధికారులతో చర్చలు జరపడం, ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మూడు, నాలుగురోజుల సమయం అయినా కావలసి ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుంటే మంత్రివర్గ విస్తరణ ఆదివారం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏ రోజు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందో శుక్రవారం వెల్లడించే అవకాశం ఉందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.