రాష్ట్రీయం

ఐస్‌గోలా తాతా... నీకు నేనున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఒక పేద వ్యక్తికి చేయూత ఇస్తూ, కేటీఆర్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 30 ఏళ్ల క్రితం అబిడ్స్‌లోని గ్రామర్ స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో ఈ స్కూల్ ఎదుట ఐస్ గోలా అమ్మిన సయ్యద్ అలీ (చావూష్)ని ప్రగతి భవన్‌కు గురువారం పిలిపించుకుని ఎదురేగి ఆలింగనం చేసుకున్నారు. ‘అలీ భాయ్ ఎలా ఉన్నావ్, ఏం చేస్తున్నావ్, నీ పిల్లలు ఏం చేస్తున్నారు, జీవితం ఎలా నడుస్తోంది’ అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ప్రగతిభవన్‌లోని తన ఛాంబర్‌లో కూచోబెట్టుకుని కొద్దిసేపు మాట్లాడారు. చిన్నతనంలో ఐస్‌గోలా కొనేవాడినని గుర్తు చేశారు. కేటీఆర్ కుశల ప్రశ్నలకు సయ్యద్ అలీ జవాబు చెబుతూ, తన పరిస్థితి బాగా లేదని చెప్పారు. తనకు గత ఏడాది గుండె ఆపరేషన్ అయిందని, జీవనం కోసం ఇప్పటికీ, గ్రామర్ స్కూల్ ఎదుట ఐస్‌గోలాలు అమ్ముతూనే ఉన్నానని అలీ చెప్పారు. అలీ పరిస్థితికి చలించిన కేటీఆర్.. అలీకి చేయూత ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇల్లు మంజూరు చేయిస్తానని, వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, అవసరమైన సాయం చేయాలని కోరారు. అధికారులు కూడా వెంటనే స్పందించారు. అలీ పిల్లలకు అవకాశాన్ని బట్టి ఏదైనా ఉపాధి చూపిస్తానని కూడా హామీ ఇచ్చారు. కేటీఆర్ ఔదార్యానికి సయ్యద్ అలీ చలించిపోయారు. ముఖ్యమైన స్థానంలో ఉన్న కేటీఆర్ తనతో మాట్లాడటం, సాయం చేస్తానని హామీ ఇవ్వడం పట్ల అలీ ధన్యవాదాలు తెలిపారు.
కలిసింది ఇలా..
కేటీఆర్‌తో సయ్యద్ అలీ కలిసేందుకు మహబూబ్ అలీ అనే యువకుడు కారణం. మహబూబ్ అలీ రెండు వారాల క్రితం కేటీఆర్‌కు ట్వీట్ చేస్తూ, ‘కేటీఆర్ గారూ.. మీరు చిన్నప్పుడు చదువుకున్న గ్రామర్ స్కూల్ ఎదుట ఐస్ గోలాలు అమ్ముకునే సయ్యద్ అలీ నేడు దీన స్థితిలో ఉన్నారు, ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు’ అంటూ ట్వీట్ చేశారు. దానికి స్పందించిన కేటీఆర్ సమాధానమిస్తూ, తప్పకుండా కలుస్తాను, అలీని తీసుకురండి అంటూ ట్వీట్‌లో సమాధానం చెప్పారు. దాంతో కేటీఆర్‌ను కలిసేందుకు సయ్యద్ అలీకి సువర్ణావకాశం లభించింది. దీంతో సయ్యద్ అలీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కేటీఆర్‌ను కలిసేందుకు సహకరించిన మహబూబ్ అలీకి కూడా సయ్యద్ అలీ కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం.. విద్యార్థి దశలో స్కూల్ వద్ద ఐస్‌గోలాలు అమ్మిన సయ్యద్ అలీతో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు