రాష్ట్రీయం

కలెక్టర్, సబ్‌కలెక్టర్, ఎస్పీలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి లీగల్ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతిరూరల్, ఫిబ్రవరి 14: ఓట్లు గల్లంతు చేస్తున్నా, చంద్రగిరి నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నా, అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో మరోమార్గం లేక జిల్లా కలెక్టర్, సబ్‌కలెక్టర్, చిత్తూరు, తిరుపతి ఎస్పీలకు లీగల్ నోటీసులను ఇచ్చినట్లు చంద్రగిరి నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న చంద్రగిరి నియోజవకర్గంలో టీడీపీ నేతలు చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. గత నాలుగు రోజుల నుండి ప్రతి గ్రామంలో ఒక సామాజికవర్గాన్ని ఆధారంగా చేసుకుని వైసీపీకి చెందిన ఓట్లను 10వేలకు పైగా తొలగించారన్నారు. చిన్నగొట్టిగల్లు మండలంకు చెందిన టీడీపీ అధ్యక్షుడు శివకుమార్ ఫోన్లో వైకాపా ఓట్లు తొలగించాలని, అలాగే దొంగ ఓట్లను యాడ్ చేయాలని చెబుతున్న వీడియోను మీడియా సమక్షంలో వినిపించారు. ఆ వీడియోను జనవరి 22న కలెక్టర్ పంపినా, సబ్‌కలెక్టర్‌కు పిర్యాదు చేసినా ఇనంతవరకు స్పందించలేదన్నారు. టెక్నాలజీ సాయంతో మీ సేవా, ఇంటర్నెట్ సెంటర్ల ఆధారంగా ఓట్లు తొలగించబడ్డాయని సైబర్‌క్రైమ్ కింద కేసులు నమోదు చేసి కూపీలాగితే వెనుక ఉండే దొంగలు బయటపడుతున్నారన్నారు.