రాష్ట్రీయం

20న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 14: ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు సాగనున్న ఈ పర్యటనలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 9.25 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయం రన్‌వే విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పలు పనుల ప్రారంభోత్సవాలతోపాటు శంకుస్థాపనలు చేస్తారు. 21న నెల్లూరు జిల్లాలోని సర్దార్ పటేల్ నగర్‌లో మెడికల్ క్యాంప్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ శిలాఫలకం ఆవిష్కరిస్తారు. నెల్లూరులో రైల్వేస్టేషన్‌లో పలు అభివృద్ధి పనులతో పాటు నెల్లూరు - చెన్నై మెము ట్రైన్ సర్వీసును ప్రారంభిస్తారు. 22వ తేదీ శుక్రవారం స్వర్ణ్భారత్ ట్రస్ట్ 18వ వార్షికోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొంటారు. 23వ తేదీ శనివారం స్వర్ణ్భారతి ట్రస్ట్‌లో మెడికల్ క్యాంప్ ప్రారంభిస్తారు. అదే రోజు తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి ఢిల్లీ పయనమవుతారు.