రాష్ట్రీయం

వరుసగా వింతపక్షుల లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, ఫిబ్రవరి 15: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో గురువారం వింతపక్షి లభ్యమైన సంఘటన మరుసటి రోజైన శుక్రవారం నాడు మండలంలోని నాతాళ్లగూడెం గ్రామంలో అటువంటి వింతపక్షి లభ్యమైంది. శుక్రవారం నాడు ఉదయం పల్సం దానయ్య వ్యవసాయ బావివద్ద గల పొలంలో ఉద్దగిరి భరత్‌కుమార్, మస్కు మురళి ఏదో కదులుతుందని గమనించి చూడగా ఏగరలేకపోతున్న వింతపక్షి కనిపించింది. దీనితో వారు వింతపక్షిని పట్టుకొని గ్రామంలోకి తీసుకురాగా జనం వింతపక్షిని ఆసక్తిగా గమనించి గతంలో తాము ఇటువంటి పక్షిని ఏన్నడూ చూడలేదని ఇది వింతగా ఉందని అంటున్నారు. వరుసగా రెండు గ్రామాల్లో ఒకే విధమైన వింత పక్షులు లభ్యం కావడంతో ఇవి ఏక్కడి నుండి వస్తున్నాయి అంతపట్టని రహస్యంగా ఉందని వీటితో తమకు ఏమైన సమస్యలు వస్తాయా లేక కీడు జరుగుతుందా అనే సందేహాన్ని, ఆందోళనను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.