రాష్ట్రీయం

రైతులకు తీపికబురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: రాష్ట్రంలోని సన్న, చిన్నకారు రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో శనివారం జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో రైతులకు మేలు చేసే వివిధ అంశాల గురించి చర్చించారు. ఈ చర్చల్లో ఇప్పటికే ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ పథకం’పై కూడా చర్చించారు. పొలిట్‌బ్యూరోలో చర్చించిన తరువాత ముఖ్యమంత్రి ఐదు ఎకరాల లోపు రైతులకు రూ.15 వేల సాయం చేయాలని నిర్ణయించారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయల మేర ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.9 వేలను అందచేయనుంది. దీంతో సన్న, చిన్నకారు రైతులకు కేంద్రం ఇచ్చే 6 వేలు, రాష్ట్రం ఇచ్చే 9 వేలు కలిపి రూ.15 వేల మేర ఆర్థిక సాయం అందనుంది. 5 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న వారికి ఇప్పటికే ప్రకటించినట్లుగా 4 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దీంతో వీరికి 10 వేల రూపాయల మేర సాయం అందుతుంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఈ సాయం అందేలా చర్యలు తీసుకోనున్నారు. తొలివిడత 4 వేల రూపాయలు, రెండో విడత 5 వేల రూపాయలులు చెల్లించేందుకు నిర్ణయించారు. దీని వల్ల 54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దాదాపు 3600 కోట్ల రూపాయలను ఈ పథకం కింద ఖర్చు చేయనుంది.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం