రాష్ట్రీయం

అమర జవాన్ల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రదాడిలో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉండవల్లి ప్రజావేదికలో శనివారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో జవాన్ల ఆత్మకు శాంతి కలుగాలని రెండు నిమిషాలు వౌనం పాటించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి అత్యంత బాధాకరమన్నారు. మానవ సమాజంలో ప్రాణాలు బలితీసుకునే ఈ తరహా దారుణాలు దుర్మార్గమని, అత్యంత హేయమని వ్యాఖ్యానించారు. 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం గుండె చెదిరే విషాదమన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత ప్రభుత్వం
తీసుకునే ఎటువంటి చర్యకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘోరకలి జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. అమర జవాన్ల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, భారత సైనికులు నిరంతరం ఈ దేశాన్ని రక్షించే బాధ్యతను భుజాన వేసుకుని అహర్నిశలూ అప్రమత్తంగా ఉంటూ తమ విధులు నిర్వహిస్తున్నారంటూ నివాళులు అర్పించారు. మన కుటుంబాలను రక్షిస్తున్నారన్నారు. ప్రాణాలను సైతం పణంగా నిలిపి తెగువ చూపుతూ మనందరిలో స్ఫూర్తి నింపుతున్నారన్నారు. పుల్వామా దాడిలో 40 మంది చనిపోవడం జాతిని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. ఆ వీర జవాన్ల కుటుంబాలకు నైతిక స్థైర్యం అందివ్వడం తక్షణ కర్తవ్యమన్నారు. సైనికుల జీవితాలను మనం అందించే సాయంతో లెక్క కట్టలేమని, కానీ మన వంతు సహకారం అందించాల్సి బాధ్యతను విస్మరించలేమన్నారు. ఏపీ ప్రజలు పుల్వామా ఘాతుకానికి నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఒక్క గొంతుకగా నిలిచి అమరుల కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారన్నారు. వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఒక్కొక్క జవాను కుటుంబానికి 5 లక్షల రూపాయలు సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం తరపున ప్రకటించారు.

చిత్రం..జవాన్ల మృతికి సంతాపం తెలుపుతున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం