రాష్ట్రీయం

సీరియస్‌గా తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: రాబోయే లోక్‌సభ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొద్దిగా కష్టపడితే పార్టీ పునర్ వైభవాన్ని సాధించుకోవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడానికి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్య నాయకులతో గచ్చిబౌలిలోని ఒక హోటల్‌లో శుక్రవారం నుంచి సమీక్షా సమావేశాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన మూడు రోజుల పాటు జరుగుతున్న సమీక్షా సమావేశాలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సీ కుంతియా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇంకా జిల్లా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు, మండల అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. రెండో రోజు మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా హాజరైన నాయకులనుద్దేశించి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ పోలింగ్ కేంద్రాల స్థాయి ఏజెంట్ల నియామకం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితా సవరణల పేరిట కాంగ్రెస్ కార్యకర్తల, అభిమానుల పేర్లను తొలగిస్తున్నారని ఆయన తెలిపారు. కాబట్టి ఓటర్ల నమోదు, తొలగింపుల విషయంలో జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్‌ల ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారని, అనేక స్థానాల్లో పార్టీ విజయం సాధించిందని ఆయన గుర్తు చేశారు. గతంతో పోలిస్తే తమ పార్టీకి ఓట్ల శాతం పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది సోనియా గాంధీ కాబట్టి, మెజారిటీ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ఆమెకు కానుకగా ఇద్దామని గ్రామల్లో ప్రజలకు చెప్పాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు.

చిత్రం.. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో
మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్