రాష్ట్రీయం

ఓటర్ల లిస్టులో తప్పులు దొర్లితే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: లోక్‌సభ, శాసనసభతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల లిస్టు రూపకల్పనలో ఎటువంటి తప్పులు చోటుచేసుకున్నా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఓటర్ల లిస్టులను ఈ నెల 20వ తేదీ ప్రచురించనున్న నేపథ్యంలో 17వ తేదీ సాయంత్రం నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో రెండో బ్లాక్‌లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్‌లో 13 జిల్లాల కలెక్టర్లు, తహశీల్దార్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శనివారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఫారం 6, 7, 8 కింద 11,75,757 కొత్త ఓటర్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా వాటిలో అత్యధికంగా ఫారం 6 దరఖాస్తులు ఉన్నాయన్నారు. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లపైనా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌తో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో మీడియా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు.