రాష్ట్రీయం

‘అన్నదాత సుఖీభవ’ అమలుకు ఉత్తర్వులు జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రైతులకు ఆర్థిక సాయం అందించే అన్నదాత సుఖీభవ పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన మంత్రి కిసాన్ పథకం వర్తించే రైతులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 9వేల రూపాయలు చెల్లిస్తుంది. దీంతో కేంద్ర పథకం వర్తించే ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 15వేల రూపాయల మేర ఆర్థిక సాయం అందుతుంది. మిగిలిన వారికి 10వేల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించనుంది. మార్చిలో తొలివిడత 4వేల రూపాయలు చెల్లిస్తుంది. కౌలు రైతులకు కూడా 15వేల రూపాయలను ఈ ఏడాది ఖరీఫ్‌లో ప్రభుత్వం చెల్లించనుంది.