రాష్ట్రీయం

ఒకే వేదికపై సినీ ప్రముఖులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 17: టీఎస్సార్ కళాపరిషత్, టీవీ-9 సినీ అవార్డుల ప్రదానోత్సవం విశాఖలో ఆదివారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. టీ సుబ్బరామిరెడ్డి నేతృత్వంలో ప్రతియేటా నిర్వహించే అవార్డుల కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. తెలుగు సినీ అగ్రహీరోలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఘనత టీఎస్సార్‌కే దక్కుతుందని సినీ ప్రముఖులు ప్రశంసించారు. టీఎస్సాఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ పదేళ్లుగా సినీ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానన్నారు. విశాఖ ప్రజల సంతోషం, ఈశ్వర శక్తి తనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. ప్రజల సమక్షంలో ప్రతియేటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం తనకు ఎంతో తృప్తినిఇస్తోందన్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తనయుడు రామ్‌చరణ్ తరపున రెండు అవార్డులు అందుకోవడం తనకు పుత్రోత్సాహం వంటిదేనన్నారు. నిర్మాతగా ఖైదీ నెంబర్ 150 చిత్రానికి, హీరోగా రంగస్థలం చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్న రామ్‌చరణ్ నటనలో ఎంతో పరిణతి సాధించాడన్నారు. మగధీర వంటి చిత్రంలో నటించే అవకాశం రామ్‌చరణ్‌కు దక్కిందని, తాను ఇన్ని సినిమాల్లో నటించినా అటువంటి అవకాశం రాలేదన్నారు. ఆ లోటును భర్తీ చేసేందుకు రామ్‌చరణ్ సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నాడన్నారు. దాసరి నారాయణరావు మెమోరియల్ అవార్డు దక్కించుకున్న మోహన్‌బాబు మాట్లాడుతూ తనకు గురువు, దైవం, తండ్రి వంటి దాసరి పేరిట అవార్డు తొలిసారిగా తనకే దక్కడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. నటుడు నాగార్జున మాట్లాడుతూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళా కార్యక్రమాల్లో సినీ పరిశ్రమను భాగస్వామ్యం చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అగ్రహీరోలంతా ఒకే వేదికపై అవార్డుల ఫంక్షన్‌కు రావడం చాలా అరుదైన సంఘటనగా పేర్కొన్నారు. అనంతరం హీరో బాలకృష్ణ (గౌతమీపుత్ర శాతకర్ణి), నాగార్జున (దేవదాస్)లకు అవార్డులు అందజేశారు. అలాగే శ్రీదేవి స్మారక అవార్డును ప్రఖ్యాత హిందీ నటి విద్యా బాలన్‌కు అందజేశారు. అలాగే ఉత్తమ నటిగా కీర్తి సురేష్ (మహానటి), పూజాహెగ్డే, రాశీఖన్నా, రకుల్ ప్రీత్‌సింగ్‌లకు దక్కాయి. బహుభాషా చిత్రాల్లో నటించి మెప్పించిన కుష్బూకు ప్రత్యేక అవార్డు లభించింది. అలాగే రాజేంద్రప్రసాద్ అఖిల్, నాగచైతన్య, రాజశేఖర్, ఆది పినిశెట్టి, కల్యాణ్ రామ్, సిరివెనె్నల సీతారామశాస్ర్తీ, షాలినీ పాండే, దేవిశ్రీ ప్రసాద్, క్రిష్, ప్రియాంక దత్ తదితరులకు అవార్డులు అందజేశారు. ఈ సినీ అవార్డుల ప్రదానోత్సంలో హిందీ సినీ నిర్మాత బోనీ కపూర్, తమిళ హీరో విశాల్, ఆలీ, శ్రద్ధాదాస్ తదితరులు పాల్గొన్నారు. అవార్డుల ప్రదానోత్సవానికి సినీ హీరోయిన్లు, నటీనటులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
చిత్రం.. ఉగ్రదాడిలో మరణించిన అమర జవాన్లకు నివాళిగా వౌనం పాటిస్తున్న రాజ్యసభ సభ్యుడు కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి, సినీనటులు