రాష్ట్రీయం

నిరాడంబరంగా కేసీఆర్ పుట్టినరోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తన 65వ పుట్టిన రోజును నిరాడంబరంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సీఎం క్యాంపు కార్యాలయం (ప్రగతి భవన్) ఆవరణలో మొక్కలు నాటారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా పలువురు నాయకులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.
పుల్వామా ఘటనతో..
కాశ్మీర్‌లోని పుల్వామాలో రెండు రోజుల క్రితం సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడి ఘటనలో 40 మంది జవాన్లు మరణించడంతో కలత చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది తాను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన తనయుడు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తమ సొంత జిల్లాల్లో, స్వగ్రామాల్లో భారీగా మొక్కలు నాటారు.
ప్రగతి భవన్‌లో..
ఇలాఉండగా ఆదివారం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు ఒక్కో మొక్క నాటారు. కేసీఆర్ సతీమణి శోభతో పాటు కేటీఆర్ భార్య శైలిమా, కుమార్తె అలేఖ్య, కుమారుడు హిమాన్షు మొక్కను నాటారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు తండ్రి కావడం గర్వంగా ఉందని కేటీఆర్ తెలిపారు.
తలసాని అధ్వర్యంలో..
మరోవైపు సనత్‌నగర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు జరుపుకున్నారు.