రాష్ట్రీయం

సింహవాహనంపై నరసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 17: యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల మూడవ రోజు ఆదివారం సింహముఖుడైన శ్రీ లక్ష్మీనరసింహుడు సింహవాహన అలంకార సేవ, అశ్వవాహన అలంకార సేవల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో నిత్యారాధనల అంతరం ప్రబంధ పారాయణాలు, యాజ్ఞీకులచే నిత్య హవనములు మూలమంత్ర జపములు పాంచరాత్రిగమరీత్యా నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారిని సింహహవాన సేవలో అలంకరించి తిరువీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. హిరణ్యకశ్యపుడిని వధించి జగద్రక్షణ చేసేందుకు స్వామివారు సింహముఖుడిగా నరసింహవతారం దాల్చారని, సింహ శబ్ధం అంటే శతృభీతి, పాపనాశన, ఆశ్రీత రక్షణ తత్పరత ఒటేచోట గూర్చిన నరసింహ అవతారమని పుణరాల ప్రశస్తి. ప్రాతః స్మరణీయ శ్రీ నృసింహ రూపమని వేద పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహుల ఎదుర్కోలు వేడుకను పండిత బృందం శాస్తయ్రుక్తంగా నిర్వహించింది. అశ్వవాహన అలంకారసేవలో జగద్రక్షుడైన లక్ష్మీనరసింహుడిని మేళాతాళల మధ్య ఊరేగింపుకు ఆస్థాన కల్యాణ మండపం వద్ధకు తోడ్కోని వచ్చారు. క్షీరరాజ తనయ, జగద్రక్షిణి శ్రీ లక్ష్మీ అమ్మవారిని ముత్యాల పల్లకిలో కల్యాణ మండపం వద్ధకు మేళాతాళలతో తోడ్కోని రాగా స్వామిఅమ్మవార్ల ఇరువురి పెద్దలు, పండితులు వధూవరులై శ్రీ లక్ష్మీనరసింహుల గుణగణాలను, వైభవాన్ని, పెళ్లి పెద్దలు లక్ష్మీనరసింహులకు లగ్నపత్రికను రాసుకుని నేడు సోమవారం రాత్రి 9గంటలకు తిరుకల్యాణత్సవ జరుప సుమూహుర్తం నిర్ణయించారు.
చిత్రం.. యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో సింహవాహన రూఢుడై
తిరు వీధుల్లో విహరించిన శ్రీ లక్ష్మీనరసింహులు