రాష్ట్రీయం

నా ప్రాణానికి రక్షణ లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: తన రాజకీయ రంగ ప్రవేశంతో కొన్ని శక్తులు తన సోదరుడు డేవిడ్‌రాజును హతమార్చి తనను శాశ్వతంగా జైలుకి పంపించే ప్రయత్నం చేశాయని, ఇప్పటికీ తనకు రక్షణ లేదని రాష్ట్ర డీజీపీకి విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణలో మాత్రం అడిగిన వెంటనే తనకు రక్షణ కల్పించారని చెప్పారు. ట్రస్ట్‌కు కోట్లాది రూపాయల ఆస్తులున్నప్పటికీ తన పేరిట, లేదా కుటుంబం పేరిట లక్ష రూపాయలకు మించి లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని చెప్పారు. విశాఖ, కాకినాడ, తిరుపతి నుంచి పోటీ చేయమంటూ తనపై ఒత్తిళ్లు వస్తున్నాయని, తాను మాత్రం లోక్‌సభ, శాసనసభకు పోటీ చేస్తానని తెలిపారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’లో పాల్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమి విజయానికి తాను పాటుబడినప్పటికీ ప్రస్తుతం వైకాపాతో పాటు ఆ రెండు పార్టీలు కూడా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నందున దూరంగా ఉన్నానని చెప్పారు. చంద్రబాబుతో కుమ్మక్కవుతున్నాననే ప్రచారం అవాస్తమని, ఛోటా బాబు 6వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ జగన్ ముద్రించిన పుస్తకంపై తాను ప్రచారం చేస్తున్నానన్నారు. ఇంతకాలం గత ఎన్నికల హామీలను పూర్తిగా అమలుచేయలేని బాబు ఈ 10రోజుల్లో చేస్తానని చెప్పటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తమ పార్టీ పేరిట వేల కోట్లు వసూలు చేస్తున్నాననేది తప్పుడు ప్రచారమని ఖండించారు. తనకున్న ఒక ఎకరా భూమి విక్రయించగా లక్ష రూపాయలు వచ్చిందంటూ సంబంధిత డాక్యుమెంట్లు చూపించారు. కేంద్ర ప్రభుత్వం ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ తేవటం వల్ల విదేశాల నుంచి నయాపైసా రావడం లేదని, రేపు రాహుల్, కేసీఆర్, ములాయం సింగ్ నాయకత్వంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని సవరిస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం ఓటర్లలో తమ పార్టీకి 30శాతం మద్దతు ఉంటే జగన్‌కు 15శాతం, బాబుకు 18శాతం, ఇతర పార్టీలకు రెండుమూడు శాతం మించి లేదన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగదళ్‌తో పాటు బాబు, జగన్ వల్ల కూడా తనకు ప్రాణహాని పొంచి ఉందని ఆరోపించారు. ఒకవేళ తనను ఎవరైనా చంపేస్తే తదనంతరం తన ట్రస్ట్ ఆస్తులన్నింటినీ పేదలకు సహాయం కోసం వెచ్చించాలంటూ వీలునామా రాసి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందజేస్తానన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే శక్తిసామర్థ్యాలు తనకున్నా ప్రధాని మోదీ అనుమతి ఇవ్వటంలేదన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌తో పాటు తమ పార్టీ అధికారంలోకి వస్తే ట్రంప్‌ను విశాఖపట్నం తీసుకొస్తానని, అలాగే పెద్దఎత్తున నిధులు కూడా సమీకరిస్తానని చెప్పారు. తాను ఎన్నికల బరిలోకి దిగటంతో పవన్‌కళ్యాణ్‌కు ప్రజామద్దతు సగానికి సగం పడిపోయిందని పాల్ పేర్కొన్నారు.
చిత్రం.. ‘మీట్ ది ప్రెస్’లో మాట్లాడుతున్న కేఏ పాల్