రాష్ట్రీయం

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ టీఆర్‌ఎస్ అధినేతకు అగ్నిపరీక్షే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, ఫిబ్రవరి 17: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర మలి ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణకు మహామాఘి పర్వదిన ముహూర్తం ఖరారైంది. ఇక ప్రస్తుత విస్తరణలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారి సంఖ్య తేలాల్సి ఉంది.
గత ప్రభుత్వ ఏర్పాటు వలె కాకుండా ఈసారి కొందరిని మాత్రమే మంత్రిమండలికి తీసుకుని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మిగిలిన వారిని భర్తీ చేయనున్నారని విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎంత మందిని, ఏ ప్రాతిపదికన తీసుకోనున్నారనే విషయం అంత సులభంగా ఇదమిద్దంగా స్పష్టం కాకుండా ఉంది. గతానికి ఈసారి ఎంపికకు చాలా ప్రాముఖ్యత తేడాల అంశాలు ఉన్నాయి. తొలి ప్రభుత్వంలో మార్పులు చేర్పులు ఉంటాయని చాలాసార్లు ప్రచారాలు జరిగినా, అలాంటివి చోటు చేసుకోనే లేదు. మహిళకు స్థానం లేకున్నా, సీనియర్లను పక్కన పెట్టినా, అసమ్మతి, అసంతృప్తులకు తావే లేకుండా చేయడంలో గులాబి బాస్ కృతకృత్యులైనారు. గత ఎన్నికల కన్నా ఈసారి సీట్లు అధికంగా రావడం, ఈసారి ఆశావహులు అధిక సంఖ్యాకులు ఉండడం ఎన్నికల సభలలో అభ్యర్థులను గెలిపిస్తే, ఉన్నత స్థానాలు కల్పిస్తామని ప్రకటించడం లాంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారో లేదో తెలియకుండా ఉంది. ప్రధానంగా తెరాసలో అధినేతకు అండదండలందిస్తున్న తనయుడు, మేనల్లుడు మంత్రులుగా ఉంటారా? లేదా అన్న అంశం ప్రధాన చర్చగా మారింది. మహమూద్ అలీకి తగు ప్రాధాన్యత కల్పించినా, గత ప్రభుత్వ సీనియర్ల స్థానాలపై సందేహాలు తీరకున్నాయి. కేసిర్‌కు నాలుగు వసంతాలకు పైబడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తొలి ప్రభుత్వ ఏలుబడిలో, ఏలికకు అడుగడుగునా అసంతృప్తులు ఎదురైనా, వాటిని ఎప్పటి కపుడు దాటవేస్తూ, ప్రజల దృష్టికి వాటిని పెద్దవి కానీకుండా, తమదైన శైలిలో పరిపాలన కొనసాగించి సమయస్పూర్తికి మారుపేరుగా నిలిచారు కేసిఆర్. ప్రారంభ పార్టీ తెర మరుగై, పక్కా రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన క్రమంలో, ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించి, ఉద్యమాన్ని అణువణువునా అడ్డుకుని, గల్లీ నుండి ఢిల్లీ దాకా మోకాళ్ళడ్డువేసి, ఉద్యమాన్ని నీరుగార్చే పార్టీల ప్రతినిధులుగా వ్యవహరించిన పలువురిని తెరాసలోనికి సాదరంగా ఆహ్వానించి, వారికి బ్రహ్మరథం పట్టి, చేరినదే తడవుగా, ఉన్నత పదాధికారుల చేసిన సందర్భాలలో ఆదినుండి ఉద్యమంలో చిత్తశుద్ధితో పాల్గొని, ఉద్యమాన్ని తమ భుజస్కందాలపై మోసిన ఉద్యమ కారులకు, రాజకీయ వలస వాదుల పట్ల తెరాస అధినేత వైఖరి అసంతృప్తికి కారణమవుతూనే ఉంది. ఉద్యమ సమయం నుండి వెన్నుదన్నుగా ఉన్న తమను పక్కన బెట్టి, నిన్నగాక మొన్న చేరిన వారు పదవులు పొందడం మింగుడు పడని అంశమై అసంతృప్తి జ్వాలలకు ఆజ్యం పోస్తూనే ఉంది. భవిష్యత్తుపై దృష్టి ఉంచి, మొక్కవోని ధైర్యంతో, దృఢ సంకల్పంతో తీసుకున్న నిర్ణయాన్నింటిలో దాదాపు సత్ఫలితాలను సాధించిన కేసిఆర్‌కు, పెరిగిన నియోజక వర్గాల అంశం విస్తరణలో మళ్లీమళ్లీ ఆలోచింప చేస్తున్నది. గత ప్రభుత్వంలో రాకున్నా, ఈసారైనా తమకు మంత్రివర్గంలో అవకాశాలు రాగలవని గంపెడాశతో ఎదిరి చూపులు చూస్తున్న వారికి ఎలా సర్దుకు పోతారని విశే్లషకులు మెదళ్ళకు పదును పెడుతున్న అంశంగా మారింది. మహిళలు, జిల్లాలు, కుల, వర్గ, అనుభవాది అంశాలపై కేసిఆర్ ఎలా కసరత్తు చేస్తున్నారనేది తలపండిన రాజకీయ మేధావులకు అంతుచిక్కకుండా ఉంది. విపక్షీయులను స్వీయ రక్షణలకే పరిమితం చేస్తూ, మారుమాట్లాడనీకుండా చేయగల కేసిఆర్ నైపుణ్యం, స్వపక్షంలో అనుచర గణ గళాలను ఎలా నియంత్రిస్తారో, ఏ మంత్రం ఏ తంత్రం వినియోగించి అగ్ని పరీక్షలో నెగ్గుతారో రాగల కొన్ని గంటలలో సమాధానం దొరకనుంది.