రాష్ట్రీయం

సాంకేతిక కారణాలతో ఆగిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట: రైలుఇంజన్‌లో సాంకేతిలోపం తలెత్తడంతో తెలంగాణలోని రామన్నపేట రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రామన్నపేట-బోగారం గ్రామాల మధ్య యాభై నిమిషాలపాటు నిలిచిపోయింది. విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి సాయంత్రం ఆరుగంటల పది నిమిషాలకు రామన్నపేట రైల్వే స్టేషన్ చేరుకుంది. స్టేషన్ నుంచి బయలుదేరిన అనంతరం నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించి రామన్నపేట, బోగారం గ్రామాల మధ్య నిలిచిపోయింది. సుమారు యాభై నిమిషాల రైలు నిర్మానుష ప్రాంతంలో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. రైల్వే అధికారులు హుటాహుటిన స్పందించి మరో ఇంజన్ ఏర్పాటుచేయడంతో రైలు ముం దుకు వెళ్లిపోయింది. సమస్య పరిష్కారం కావడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.