రాష్ట్రీయం

బీసీలపై మొసలి కన్నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 18: తెలుగుదేశం పార్టీకి బీసీలే వెనె్నముక అని, జనాభాలో 50శాతం ఉన్న బీసీల మద్దతు టీడీపీకేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీన్ని జీర్ణించుకోలేక వైకాపా విమర్శలు చేస్తోందని ఆరోపించారు. జగన్ మొసలి కన్నీరును బీసీలు నమ్మరని వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి ఎలక్షన్ మిషన్‌లో భాగంగా టీడీపీ ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, పార్టీ బాధ్యులతో ఆయన సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తమ పార్టీ నిర్వహించిన జయహో బీసీ సభతో వైకాపా బెంబేలెత్తుతోందని ఎద్దేవా చేశారు. జగన్ ఒక రకమైన నిరాశలో ఉన్నారన్నారు. నిరాశా నిస్పృహలతోనే ఏలూరులో బీసీ సభ పెట్టారన్నారు. జగన్ తండ్రి బీసీలను అణచివేశారని, బీసీ ఫెడరేషన్లకు కుర్చీలు, బెంచీలకు కూడా నిధులు ఇవ్వలేదని గుర్తుచేశారు. బీసీ సబ్‌ప్లాన్‌కు టీడీపీ ప్రభుత్వమే చట్టబద్ధత కల్పించిందన్నారు. మళ్లీ చట్టబద్ధత కల్పిస్తాననడం జగన్ అవివేకానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. చేసిన చట్టానే్న మళ్లీ చేస్తానంటున్నారని, బడ్జెట్, నిధుల విడుదల గురించి జగన్‌కు ప్రాథమిక ఆర్థిక నిబంధనల పరిజ్ఞానం లేదని విమర్శించారు. అవినీతి సంపద పెంచుకోవడమే ఆయనకు తెలుసునని, సమాజ సంపద పెంచడం చేతకాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైఎస్ పాలనలో కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ ఐదేళ్ల టీడీపీ పాలనలో కౌలురైతుల్లో పూర్తి భరోసా కల్పించామన్నారు. కౌలురైతు కుటుంబానికి 15వేల రూపాయలు ఇస్తున్నామని, కౌలురైతుకు కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు. కౌలు రైతులకు రూ.9654 కోట్ల రూపాయల మేర రుణాలు ఇవ్వడం దేశంలోనే రికార్డని చెప్పారు. కాపులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా లబ్ధి చేకూర్చామన్నారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, భారీగా నిధులు కేటాయించామన్నారు. కాపు భవన్‌లు నిర్మిస్తున్నామని, విద్యార్థుల విదేశీ విద్యకు సాయం చేశామన్నారు. తన కష్టం, మనందరి కష్టం ప్రజల కోసమేనని స్పష్టం చేశారు. ఆనందదాయక సమాజ నిర్మాణమే ధ్యేయమన్నారు. కులం, మతం తమ అజెండా కాదని, రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమమే ప్రధానమన్నారు. పసుపు-కుంకుమ ఒక అన్న ఇచ్చాడన్న భావన ఉందని, కుటుంబ సంబంధాలకే టీడీపీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పార్టీలో అందరూ పోటీపడి పనిచేయాలని, అందరికీ బాధ్యతలపై స్పష్టత ఇచ్చామన్నారు. మంచి రాజకీయ బృందాన్ని రూపొందించామని, ఐవీఆర్‌ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.