రాష్ట్రీయం

సాయం రూ.30 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 18: పుల్వామా దాడిలో అమరులైన వీరజవాన్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కొక్కరు 500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ మొత్తం 30కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ ఎన్జీవోల సంఘం నేతలు సోమవారం అందజేశారు. కష్టకాలంలో ప్రభుత్వ ఉద్యోగులు చూపిన ఔదార్యాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. వీరజవాన్ల కుటుంబాలకు ఇప్పటికే 5లక్షల చొప్పున సాయం ప్రకటించామని, ఈ మొత్తాన్ని కూడా కలిపి ఆయా కుటుంబాలకు అందజేస్తామని చెప్పారు. ఏపీ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల తరపున 25లక్షల రూపాయలను వీరజవాన్ల కుటుంబాలకు సాయంగా అందజేశారు.
నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతా
రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతానని ఏపీ ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు ప్రభుత్వం ఏవిధంగా మేలుచేయాలో చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రానికి సహకరించాలని కోరారు. మళ్లీ మీరే రావాలని ప్రైవేట్ స్కూళ్ల ప్రతినిధులు సమావేశంలో ప్లకార్డులు ప్రదర్శించిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అందరి సహకారం ఉంటే మళ్లీ మీ సేవ చేసేందుకు ముందుకు వస్తానన్నారు. మంగళవారం ఉదయం అధికారులతో చర్చించి స్కూల్ మేనేజ్‌మెంట్ల సమస్యను పరిష్కరిస్తూ మంగళవారం ప్రకటన చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.