రాష్ట్రీయం

కమనీయం.. రమణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 18: యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి జగత్‌ద్రక్షుడైన శ్రీ లక్ష్మీనరసింహుల తిరు కల్యాణ మహోత్సవం పాంచరాత్రాగమశాస్త్రానుసారం కన్నుల పండువగా నిర్వహించారు. సుగంధ భరిత పరిమళాలతో కూడిన వివిధ రకాల పుష్పమాలలు, విద్యుద్దీపాలతో, మామిడి తోరణాలతో అందంగా అలంకరించిన ఆలయ కల్యాణ మండ ప వేదికపై లక్ష్మీనరసింహులను ఆశీనులు గావించిన అర్చక బృందం ఆద్యంతం స్వామి, అమ్మవార్ల ప్రాశస్త్యాన్ని, కల్యాణ ఘట్టం, బ్రహ్మోత్సవాల విశేషాలను భక్తులకు వివరిస్తూ శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. సముద్ర రాజ తనయ లక్ష్మీ అమ్మవారికి, జగదానందకారుడు, లోక రక్షకుడైన శ్రీ లక్ష్మీనారసింహుడికి బ్రహ్మోత్సవాల వేళా జరిగే కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు గరుడుడి ఆహ్వానంతో తరలివచ్చిన బ్రహ్మాది ముక్కోటి దేవతలు, సుర మునులు, ముల్లోకాల నుండి యాదా ద్రి పుణ్యక్షేత్రానికి తరలివచ్చిన భక్త జనులు స్వా మి అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. ప్రధానార్చకులు నంధీగల్ లక్ష్మీనరసింహాచార్యులు సారధ్యంలోని అర్చక బృందం, యాజ్ఞిక బృందం పర్యవేక్షణలో సాగిన స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవంలో మాంగల్యాధారణ, తలంబ్రధారణ ఘట్టాలను వీక్షించిన భక్త జనం భక్తీ పారవశ్యంతో చేసిన గోవింద నామస్మరణలతో యాదా ద్రి పాతగుట్ట పరిసరాలు మారుమ్రోగాయి. జగద్రక్షుడైన శ్రీ లక్ష్మీనరసింహుల కల్యాణం లోక కల్యాణార్ధమేనని పురాణ ప్రసిద్ధి. లోక కల్యాణం కోసం బ్రహ్మాది దేవతలు శ్రీశ్రీ స్వామివారికి నిర్వహించిన కల్యాణ వేడుకలనే ఆగమశాస్త్రానుసారం బ్రహ్మోత్సవాలుగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నిత్యులు, ముక్తులు పరమాత్ముని చేరి స్తుతించు వేళలో అమ్మవారు భగవానుని చేత సం సార బుద్ధలైన జీవులను కాపాడునట్లు చేయు ట ఈ కల్యాణోత్సవం విశిష్టత. అమ్మవారితో కూడిన భగవానుని సేవించిన భక్తుల కోరికలు నేరవేరునని పురాణ ప్రశస్తి. స్వామి వారి కల్యాణోత్సవం పిదప మహామంత్ర పుష్ప పఠనం, చతుర్వేద పారాయణాలు, మహాదాశ్వీరచన కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు కల్యాణ దంపతులైన శ్రీ లక్ష్మీనరసింహులను బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవలో తిరు వీధుల్లో ఊరేగించారు. గజేంద్ర మోక్ష ఘట్టం శరణాగతులైన భక్తులకు స్వామివారి రక్షణ సిద్ధిస్తుందని చాటుతుందని, జగద్రక్షుడైన శ్రీ లక్ష్మీనరసింహుల కల్యాణం తిలకించిన ఇతిబాధలు సమసి సకల సౌభాగ్యాలు లభిస్తాయని అర్చకులు తెలిపారు. ఈ కల్యాణోత్స వం, గజవాహన సేవోత్సవం కార్యక్రమంలో ఆలే రు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, యాజ్ఞీకులు భాష్యాచార్యులు, ఆలయ పర్యవేక్షులు వెంకటేశ్వర్‌రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.