రాష్ట్రీయం

ఎంపీ నిధుల వినియోగంలో పొంగులేటి టాప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 18: ప్రభుత్వం ఏటా లోక్‌సభ సభ్యునికి ఇచ్చే నిధులను వినియోగించటంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రభుత్వం ఏటా ఒక్కో సభ్యునికి 5కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లకు 25కోట్లు మంజూరు చేస్తుంది. రాష్ట్రంలో నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి 20 వేల కోట్లు మంజూరు చేయగా, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డికి 17.50 కోట్లు విడుదల చేశారు. మిగిలిన లోక్‌సభ సభ్యుల్లో పొంగులేటి, మరికొందరికి 12.50 కోట్లు విడుదల చేశారు. అవి వడ్డీతో కలుపుకొని 16.48 కోట్లు అయ్యాయి. ఖమ్మం ఎంపీ పొంగులేటి 21.66 కోట్ల రూపాయల విలువైన పనులను తన నిధుల నుండి మంజూరు చేయాలని అధికార యంత్రాంగాన్ని కోరగా 21.59 కోట్లకు అనుమతులిచ్చారు. ఉన్న నిధులను ఆయన పూర్తిస్థాయిలో ఖర్చు చేశారు. ఇంకా రావాల్సిన నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. విడుదలైన నిధులు, ఖర్చు చేసిన నిధులపై లోక్‌సభ వెబ్‌సైట్ సోమవారం జాబితా విడుదల చేయగా పొంగులేటి పూర్తిస్థాయిలో వినియోగించినట్లు నిర్థారణ అయింది. అధిక నిధులు విడుదల చేయించుకున్న ఇతర పార్లమెంట్ సభ్యుల కంటే కూడా ఆయన ఎక్కువ స్థాయిలో పనులు చేయించినట్లు తెలుస్తోంది. దీనిపై పొంగులేటి స్పందిస్తూ తన ఎంపీ కోటా నిధులను ప్రజలకు మరింత మెరుగైన వౌలిక సదుపాయాలు కల్పించేందుకు వినియోగించానని చెప్పారు. కేంద్రం ఇంకా పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయాల్సి ఉందని, తాను ఇచ్చిన లేఖలను అధికారులు పరిశీలించి వెంటనే మంజూరు చేసి పనులు కూడా ప్రారంభించటం, కొన్నింటిని పూర్తి చేయటం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు చేర్చటమే లక్ష్యంగా పనిచేశానని, నిధుల వినియోగంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంటానని ఊహించలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో పేదలకు అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని ఎంపీ పొంగులేటి వివరించారు.
కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో పొంగులేటి చేరిక (ఫైల్)