రాష్ట్రీయం

శక్తికి మించి సాహసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 18: తన శక్తికి మించి సాహసాలు చేస్తున్నానని, ఆదాయానికి మించి ప్రయోజనాలు అందిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఏపీ ఎన్జీవో, సెక్రటేరియట్ అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం ఆయన మాట్లాడారు. సంపద సృష్టించి అన్నివర్గాల వారికి పంచడం తన బాధ్యతగా భావించి ఆ దిశగా శాయశక్తులా కృషి చేస్తున్నానన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం చరిత్రాత్మకం అని గుర్తుచేశారు. విభజన జరిగితే కష్టాలు వస్తాయని ఊహించి సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమించారన్నారు. 54శాతం ఆదాయం తెలంగాణకు, 46 శాతం ఆదాయం ఏపీకి వచ్చిందన్నారు. అప్పులు మాత్రం జనాభా దామాషా ప్రకారం ఏపీకి ఎక్కువగా వచ్చాయన్నారు. కుటుంబాల్ని చూసేందుకు శని, ఆదివారాలు చాలునని చెప్పి, ఈ గడ్డపై పరిపాలన సాగించేందుకు ఉద్యోగులు ముందుకొచ్చారని గుర్తుచేశారు. ఒక్కోసారి ఈవిషయంలో తాను కష్టపెట్టినా శ్రమ అనుకోకుండా పనిచేశారన్నారు. నాలుగున్నరేళ్లలో మంచి ఫలితాలు సాధించామంటే అందుకు ప్రతిఒక్కరూ శ్రమించడం వల్ల సాధ్యమైందన్నారు. రాష్ట్రానికి 670 అవార్డులు దక్కాయంటే అంతా సంఘటితంగా కలిసి పనిచేయడం వల్లే సాధ్యమైందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా ఉద్యోగులు చేస్తున్న శ్రమను గుర్తించి ఎప్పుడూ, ఎవ్వరూ ఇవ్వనంతగా 20శాతం మధ్యంతర భృతిని ప్రకటించానన్నారు. రాజధానిలో అందరికీ సొంత ఇళ్లు ఉండాలని ఇళ్ల స్థలాలు అందించేందుకు కూడా నిర్ణయించి, కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేశామన్నారు. సంపద పెంచామని, సమర్థవంతంగా పనిచేశామన్నారు. మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో కేంద్రం సహకరించి ఉంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించేవారిమన్నారు. వృద్ధులు, డ్వాక్రా మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, తదితర అన్నివర్గాల వారికి ప్రభుత్వం ఎంతో మేలు చేసిందన్నారు. అందరితో మనసు విప్పి మాట్లాడుతున్నానని, మీపై ఇప్పుడు గురుతర బాధ్యత ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం ముఖ్యమన్నారు. తాను ఎంతవరకూ చేయగలనో అంతమేర మేలు చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉంటారని విశ్వసిస్తున్నట్లు చంద్రబాబు ఆశాభావం వ్యక్తపరిచారు.