రాష్ట్రీయం

షాతో రహస్యంగా మాట్లాడారనే హరీశ్‌కు హుళక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో రహస్యంగా మాట్లాడటం, ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులకు రహస్యంగా డబ్బులు అందజేయడం వంటి బలమైన కారణాల వల్లనే మంత్రి వర్గ విస్తరణకు స్థానం కల్పించకుండా మాజీ మంత్రి హరీశ్‌రావును పక్కన పెట్టినట్టు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హరీశ్‌రావుకు మంత్రి ఇవ్వకపోవడానికి కారణం ఇదేనంటూ రేవంత్‌రెడ్డి సంచలన విషయాలను వెల్లడించారు. సోమవారం శాసనసభా పక్షం కార్యాలయంలో రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేస్తూ టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు తెలియకుండా ఎన్నికల్లో పోటీ చేసిన 26 మంది పార్టీ అభ్యర్థులకు, నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులు ఇచ్చారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ డబ్బులు తీసుకోవడానికి కొందరు కాంగ్రెస్ అభ్యర్థులు తిరస్కరించినట్టు వివరించారు. మంత్రి పదవి ఇవ్వలేదని హరీశ్‌రావు ఎదురుతిరిగితే ఆయనపై పాస్ పోర్ట్ కేసు బయటికి తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో హరీశ్‌రావు ఫోన్లో మంతనాలు జరిపిన విషయం కూడా సీఎం కేసీఆర్‌కు తెలిసిపోయిందన్నారు. ఈ బలమైన కారణాల వల్లనే హరీశ్‌రావుకు మంత్రి పదవి దక్కడం లేదని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. రెండవసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పాలనను పక్కన పెట్టి రాజకీయ ప్రత్యర్థులను వేదించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా పట్నం నరేందర్‌రెడ్డి వద్ద 50 లక్షలు లభించినా ఆయనపై కేసు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. ఈ కేసును ఐటీ శాఖ ఈడీకి అప్పగించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.