రాష్ట్రీయం

గ్రామ స్థాయి నుంచి ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వ్యవసాయ రంగ అభివృద్ధికి, గ్రామీణ ఉపాధి అవకాశాల మెరుగుకు గ్రామీణ స్థాయి నుంచి ప్రణాళికలను రూపొందించాలని బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా సూచించారు. వెలగపూడి సచివాలయంలో నాబార్డు ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ 2019-20 క్రెడిట్ సెమినార్ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా పునేఠా మాట్లాడుతూ ఈ రెండు రంగాలకు సంబంధించి గ్రామ, మండల స్థాయి నుంచి సెక్టార్ల వారీగా ప్రణాళికలను తయారు చేస్తే ఫలితాలు ఉంటాయన్నారు. ఈ మేరకు విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించుకోవాలన్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి, వాటిని అమలు చేయడంలో ముందు ఉందన్నారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి 650 అవార్డులు వచ్చాయన్నారు. ప్రగతి సాధించడంలో ఏపీ మంచి ఉదాహరణగా చెప్పవచ్చాన్నారు. అందిరి కృషి ఫలితంగా సమ్మిళత అభివృద్ధి సాధించామన్నారు. నాబార్డ్ ఏపీ ప్రాంతీయ చీఫ్ జనరల్ మేనేజర్ కె.సురేష్ కుమార్ మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.87 లక్షల కోట్ల రూపాయల రుణ ప్రణాళికతో స్టేట్ ఫోకస్ పేపరు రూపొందించినట్లు తెలిపారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.1.23 లక్షల కోట్ల రూపాయలు, ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.32,096 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. గత మూడున్నర దశాబ్దాలుగా నాబార్డ్ వ్యవసాయ రుణ ప్రణాళికకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి ప్రణాళికలతో స్థానిక వనరుల ఉపయోగానికి, నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రాథమిక రంగం, అర్బన్ డెవలప్‌మెంట్ వంటి ఏడు మిషన్లతో సమ్మిళిత అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతూ గృహ నిర్మాణానికి రుణాలు మంజూరు చేయడంలో బ్యాంక్‌లు సహకరించాలన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందన్నారు. ప్రస్తుతం 5 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నామని, దీనికి అంతర్జాతీయ సంస్థలు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. 2022 నాటికి 60 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
బ్యాంకులు కౌలుదారులకూ రుణాలు అందించాలన్నారు. నిజమైన రైతుకు ప్రభుత్వ లబ్ధి చేరేలా చూడాలన్నారు. అన్నదాతా సుఖీభవ పథకం కింద అర్హులైన రైతు ఖాతా కింద 1000 రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ సుబ్రతా దాస్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇచ్చే రుణాలు, ఆర్థిక సహాయానికి ఫోకస్ పేపరు ప్రాథమికమైందన్నారు. ఈ సమావేశంలో ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి, మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న సీఎస్ పునేఠా