రాష్ట్రీయం

కేటీఆర్ - హరీశ్‌రావు మాటామంతీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: మంత్రివర్గంలో చోటు దక్కని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉ. 11 గంటలకే రాజ్‌భవన్‌కు చేరుకుని ప్రమాణ స్వీకారోత్సవానికి లాన్‌లో వేసిన కుర్చీల్లో ముందు వరసలో కూర్చోకుండా రెండో వరుసలోకి వెళ్ళి కూర్చున్నారు. తొలుత లోపలికి రాగానే మంత్రులుగా ప్రమాణం చేసేందుకు ముందు వరుసలో కూర్చొని ఉన్న 10 మంది ఎమ్మెల్యేలను అభినందించారు. 20 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్న టీ. హరీష్‌రావు కూడా ఆ ఎమ్మెల్యేలను అభినందించి, రెండో వరుసలో సోఫాలో కూర్చొని ఉన్న కేటీఆర్ పక్కన కూర్చున్నారు. ఈ సందర్భంగా ఇరువురూ చాలాసేపు ముచ్చటించుకోవడం కనిపించింది. కేటీఆర్ ఏదో చెబుతుంటే హరీశ్ తల ఊపుతూ చెవులు రిక్కించి వినడం కనిపించింది. ఇంతలో జాతీయ గీతాలాపనతో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు గ్రూపు ఫొటో దిగారు.