రాష్ట్రీయం

రుణ పరిమితి పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి చేయూత ఇవ్వాలని 15వ ఆర్థిక కమిషన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల పర్యటనకు సోమవారం హైదరాబాద్ వచ్చిన ఆర్థిక కమిషన్ చైర్మన్, సభ్యులతో ముఖ్యమంత్రి మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టిందని, వీటి నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చాలని కోరారు. కృష్ణా, గోదావరి నదుల నీటిని గ్రావిటీ ద్వారా వాడుకోలేకపోతున్నామని గుర్తు చేశారు. అందుకే 13 జిల్లాల్లో 18 లక్షల ఎకరాలకు సాగునీటిని గోదావరి నది నుండి తరలించేందుకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామన్నారు. ఈ పథకం నిర్మాణానికి 80వేల కోట్ల రూపాయలు తమ ప్రభుత్వం భరిస్తోందన్నారు. 15వ ఆర్థిక కమిషన్ సిఫార్సులు అమలు జరిగే 2020 నుండి 2025 వరకు కాళేశ్వరం నిర్వహణకు 40,169 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశామని, ఈ మేరకు నిధులను కేంద్రం ఇచ్చేందుకు సహకరించాలని కోరారు. అలాగే ప్రతి గ్రామానికి తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టామని గుర్తు చేశారు. 2020-2025 వరకు ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో నిర్వహించేందుకు 2,580 కోట్ల రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహణకు 10,142 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు కలిపి 12,722 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, ఈ మేరకు నిధులు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల నుండి 50 శాతం వాటాను రాష్ట్రాలకు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. దాని వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు, కార్యక్రమాలకు ఆర్థిక మద్దతు లభిస్తుందన్నారు. తెలంగాణాలో గ్రామ పంచాయతీల సంఖ్య 8,368 నుండి 12,751కు పెంచామని, అలాగే మున్సిపాలిటీలను 74 నుండి 142 కు పెంచామని కేసీఆర్ తెలిపారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థలకు ఎక్కువ నిధులు లభించేలా చూడాలని కోరారు. జీఎస్‌టి అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్రానికి వస్తున్న ఆదాయం పెరిగిందని కేసీఆర్ గుర్తు చేశారు. అదే విధంగా రాష్ట్రాలకు కూడా ఆదాయం లభించేలా చూడాలన్నారు.
రుణసదుపాయం పెంచాలి
జీఎస్‌డీపీలో మూడు శాతం వరకు రుణాలు తీసుకునేందుకు ప్రస్తుతం రాష్ట్రాలకు అవకాశం ఉందని, దీన్ని మరోక శాతం వరకు పెంచాలని కేసీఆర్ కోరారు. తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలను చేపట్టిందని, ఇవి సకాలంలో పూర్తి చేసేందుకు రుణాలు తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలకు కేంద్రం నిధులు ఇచ్చేలా చూడాలని కోరారు. రోడ్డుసెస్, క్లీన్ ఎనర్జీ సెస్ నిధులను పూర్తిగా రాష్ట్రాలకు ఇవ్వడం లేదని, నిబంధనల మేరకు ఈ నిధులను రాష్ట్రాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తరఫున అన్ని అంశాలపై నివేదికను సిద్ధం చేసి 15 వ ఆర్థిక కమిషన్‌కు ఇస్తున్నామని, దీన్ని పూర్తిగా పరిశీలించి తమకు న్యాయం చేయాలని కేసీఆర్ కోరారు.

చిత్రం.. ఆర్థిక సంఘ చైర్మన్ ఎన్.కే.సింగ్‌తో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్