రాష్ట్రీయం

వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమలలో శ్రీవారికి మంగళవారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ మలయప్ప స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణ కాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల గోవిందనామ స్మరణలతో నాలుగు మాడ వీధులు మారుమోగాయి.

చిత్రం.. తిరుమల మాడ వీధుల్లో గరుడ వాహనంపై విహరిస్తున్న శ్రీ మలయప్పస్వామివారు