రాష్ట్రీయం

మంత్రులేమన్నారంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాడు లక్ష్మీపార్వతి అడ్డుపడ్డారు.. *తరువాతబాబు మాట తప్పారు* ఎర్రబెల్లి భావోద్వేగం
హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఎప్పుడో మంత్రి కావాల్సిన తన కల ఇన్నాళ్ళకు సాకారమైందని రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలుగు దేశం పార్టీ హయాంలో నాడు ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, అయితే లక్ష్మీపార్వతి అడ్డుపడ్డారని ఎర్రబెల్లి మంత్రివర్గ విస్తరణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనూ మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి తప్పారని అన్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అలా చేయలేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆయన తెలిపారు. కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. మంత్రి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాయకులను, కార్యకర్తలను కలుపుకుని పార్టీని మరింత పటిష్టవంతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.
కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శం: తలసాని
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రిగా ప్రమాణం చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన తలసానిని నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా తలసాని ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేరుస్తానని అన్నారు. రైతుబంధు పథకాన్ని కేంద్రం ఆదర్శంగా తీసుకుంటదని ఆయన గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిథిలోని అన్ని ప్రాంతాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
సీఎం ఆశయాలకు అనుగుణంగా: ఈటల
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని మంత్రిగా ప్రమాణం చేసిన ఈటల రాజేందర్ తెలిపారు. తనకు రెండో సారి మంత్రి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని ఆయన తెలిపారు.
కేసీఆర్ కేబినెట్‌లో చోటు దక్కడం అదృష్టం: వేముల
సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో తనకు చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రిగా ప్రమాణం చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కవిత ఆయన్ను అభినందించారు. అనంతరం వేముల మీడియాతో మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన కేసీఆర్‌కు, తనకు మంత్రి పదవి ఇప్పించేందుకు కృషి చేసిన కవితకు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రినవుతానని ఊహించలేదు: మల్లారెడ్డి
తాను మంత్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదని మంత్రిగా ప్రమాణం చేసిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. తనపై ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎప్పటికీ విధేయతతో ఉంటానని ఆయన తెలిపారు. చిన్నతనం నుంచి పేదల అభ్యున్నతి కోసం కష్టపడి పని చేశానని ఆయన చెప్పారు. రాష్ట్భ్రావృద్ధి కోసం కూడా అహర్నిశలు కష్టపడతానని, బంగారు తెలంగాణ సాధనకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
మంత్రి పదవి అదృష్టంగా భావిస్తున్నా: నిరంజన్
ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో చేరడం, ఆయనతో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తొలిసారి గెలిచినా తనను మంత్రిగా చేయడం సంతోషంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినా తనకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చారని ఆయన చెప్పారు. ఆ అనుభవంతో ఇప్పుడు మంత్రిగా పని చేయడానికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
అందరికీ విధేయుడిగా ఉంటా: జగదీశ్‌రెడ్డి
రెండోసారి మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించడం సంతోషంగా ఉందని జగదీశ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పార్టీకి, ప్రజలకు విధేయునిగా ఉంటానని ఆయన చెప్పారు. గతంలో తాను నిర్వహించిన విద్యుత్తు శాఖ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అనేక సమీకరణాలతో మంత్రి వర్గాన్ని విస్తరించారని, ఎవరి సేవలను ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్పష్టత ఉందన్నారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా: శ్రీనివాస్ గౌడ్
ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వీ. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గత అసెంబ్లీలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళానని ఆయన చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించారని ఆయన తెలిపారు. సకల జనుల సమ్మె గురించి ముఖ్యమంత్రి ప్రస్తావిస్తుంటారని ఆయన చెప్పారు.
సంక్షేమ రంగం మరింత పురోగతి: కొప్పుల ఈశ్వర్
ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను చాలా జాగ్రత్తగా నిర్వహించి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రాష్ట్రానికి మరింత పేరు తెచ్చేందుకు కృషి చేస్తానని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సంక్షేమ రంగాల ద్వారా పేదలకు అందాల్సిన పథకాలను వారికి అందేలా నిరంతరం చూస్తానని ఆయన చెప్పారు.
మరోసారి అవకాశం కల్పించడం సంతోషం: అల్లోల
ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మరోసారి తనకు చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందని అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
చిత్రం.. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో మంగళవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్ నరసింహన్. పక్కన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు