రాష్ట్రీయం

తిరుపతి నుంచి రాహుల్ ఎన్నికల శంఖారావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: తిరుపతిలో ఈ నెల 22వ తేదీన జరిగే బహిరంగ సభ నుంచి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఎన్నికల సమర శంఖాన్ని పూరిస్తారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి వెల్లడించారు. అనంతపురం నగరంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా బస్సుయాత్రలో 22న తిరుపతి చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించే సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారన్నారు. గత ఎన్నికల్లో తాము అధికారంలోకి రాలేక పోయామని, అందుకే ఏమీ చేయలేక పోయామన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ప్రధాని మోదీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని రఘువీరారెడ్డి ఆరోపించారు. తిరుపతిలోని ఎస్‌వీ ఆడిటోరియం గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ను నిందించిన మోదీ ప్రత్యేక హోదా ఇస్తామంటూ వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రకటన చేసి, స్వామికే పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశారు. అదే సభా ప్రాంగణం నుంచి రాహుల్ గాంధీ హోదా భరోసా ఇస్తారన్నారు. ప్రత్యేక హోదా రాకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. టీడీపీ కూడా హోదాను అటకెక్కించి, ప్రత్యేక ప్యాకేజీ కుంభకోణంతో మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మూణ్నెళ్ల క్రితం టీడీపీకి జ్ఞానోదయమైందని, ప్రతిపక్ష వైకాపా మాత్రం ఇంకా, ఈ క్షణం వరకూ కూడా బీజేపీకి అంటకాగుతోందని ఆయన విమర్శించారు. హోదా ఇచ్చేది లేదన్న బీజేపీపై ఇంకా నమ్మకం పెట్టుకోవడం ఏమిటని వైకాపా, టీడీపీని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ కూడా పదేపదే చెప్పారని, పార్టీలకు అతీతంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యం కనుక ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఎన్నుకోవాలని ప్రజలకు మరోసారి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడం ద్వారానే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ఈ యాత్రను ఆశీర్వదించండని విజ్ఞప్తి చేశారు.
గుంటూరులో బీజేపీకి చెందిన ఓ నిజాయితీపరుడైన నాయకుడు జగన్ పార్టీ వైకాపా నుంచి అరువు తెచ్చుకున్న మనుషులతో దీక్ష చేశాడని, అయితే ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. దీంతో బీజేపీ వారే పెదవి విరిచారని, ఆర్‌ఎస్‌ఎస్ సైతం దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. నిన్న ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు..అది వివాదమైంది..ఐదేళ్లుగా రైతులకు అన్యాయం జరిగింది.. ఎలాంటి భరోసా లేదు.. గిట్టుబాటు ధర కల్పించలేదు.. రైతులు రుణ గ్రస్తులయ్యారు..ఇన్‌పుట్ సబ్సిడీ, పంట పరిహారం, సబ్సిడీ విత్తనాలు లేవు..ప్రభుత్వాలు కార్పొరేట్‌కు కొమ్ము కాస్తున్నాయి.. నోట్ల రద్దుతో రైతు నడ్డి విరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల్ని రాజకీయ కోణంలో తాము చూడటం లేదని. అధికారంలోకి రాగానే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అలాగే గిట్టుబాటు ధరకు 50 శాతం అదనంగా నిర్ణయిస్తాం..్ఛత్తీస్‌గఢ్ తరహాలో అమలు చేస్తాం.. వడ్డీ లేని రుణాలు ఇస్తాం.. తొలుత రైతులకు ఇచ్చాకే, మిగతా వారికిస్తాం..రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. అనంతపురంతో సహా వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధికి రెట్టింపు ధనం తెచ్చి ఆదుకుంటామన్నారు. ఎన్నికలు రావడంతో టీడీపీ, వైకాపా అధ్యక్షులకు నిద్ర పట్టడం లేదన్నారు. కేంద్రం సాయం లేకుండా మీరు ఏమి చేయగలుగుతారు..రూ.56 వేల కోట్లు నిధులు పోలవరానికి రాకుండా పూర్తి చేయగలరా.. సమాధానం చెప్పండని సీఎం చంద్రబాబు, వైఎస్.జగన్‌ను ప్రశ్నించారు. మీరు ప్రకటించే పథకాలకు వ్యతిరేకం కాదని, ఎన్నికల వచ్చినపుడే ప్రజలు గుర్తొచ్చారా అని నిలదీశారు. పాత గాయాన్ని (రాష్ట్ర విభజన, హోదా హామీ) గోకి పుండు చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి క్రిష్ట్ఫోర్, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, ఏపీసీసీ అధికార ప్రతినిధి కేవీ.రమణ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. అనంతపురంలో బుధవారం విలేఖరులతో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి