రాష్ట్రీయం

అభివృద్ధికి రాజకీయాల్లేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 20: అభివృద్ధి విషయంలో ప్రజాప్రతినిధులు, నేతలు రాజకీయాలకు అతీతంగా సహకరించుకోవాలని, ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీలన్న విషయాన్ని మననం చేసుకోవాలని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. మూడు రోజుల నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం బుధవారం ఆయన నెల్లూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా నగరంలో రూ.30కోట్ల వ్యయంతో నిర్మించిన నెక్లెస్‌రోడ్డు తదితర అభివృద్ధి పనులను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి రాజైనా తల్లికి కొడుకేనని, తాను కూడా దేశ ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పటికీ ఒక సాధారణ నెల్లూరువాడిగా ఇక్కడి నేలంటే తనకెంతో ఇష్టమన్నారు. తన ఉచ్వాస గ్రామాలైతే, నిశ్వాస రైతులని స్పష్టం చేశారు. ఈ కారణంతోనే గతంలో తనకెన్నో ఉన్నత పోర్టుపోలియోలు ఇస్తానన్నా కాదని, గ్రామీణాభివృద్ధి శాఖను గతంలో కోరుకున్నానని గుర్తు చేశారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసే సమయంలో దేశంలో 75లక్షల ఇళ్లను పట్టణ నిరుపేదలకు కేటాయిస్తే అందులో సుమారు 11లక్షల 31వేల ఇళ్లను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించానన్నారు. ఈ విషయంలో తాను విమర్శలు కూడా ఎదుర్కొన్నానని తెలిపారు. రాష్ట్భ్రావృద్ధి కాంక్షించి ఎన్నో పథకాలు, కేంద్ర రంగ సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చానని, అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు సహకారం సంపూర్తిగా ఇచ్చిందని కొనియాడారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ పురపాలక మంత్రిగా తాను రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టడం, అదే సమయంలో కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఉండడం తనకు కొండంత అండ, ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. రేణిగుంట విమానాశ్రయం అభివృద్ధి పనుల శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న వెంకయ్యనాయుడు