రాష్ట్రీయం

నాలుగు రోజుల సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో శాసనసభ కేవలం నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఈ నెల 22న ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలు 25న సోమవారంతో ముగియనున్నాయి. 24వ తేదీన ఆదివారం సెలవు దినం కావడంతో సభ జరిగేది శుక్ర, శని, సోమవారం మూడు మూడు రోజులు మాత్రమే. ఆర్థికశాఖ కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన వద్దనే ఉంచుకోవడంతో సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆయనే ప్రవేశ పెడుతారు. ఆర్థిక మంత్రి కాకపోయినా గతంలో ఈ శాఖను నిర్వహించిన అనుభవ రీత్యా శాసన మండలిలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. ఇలా ఉండగా శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ, శాసనమండలి వద్ద భద్రతా ఏర్పాట్లపై బుధవారం తన
చాంబర్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన పోలీసు, ఇంటెలిజెన్స్, ప్రోటోకాల్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ కె స్వామిగౌడ్‌తో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహచార్యులు, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ హాజరై సమావేశాల నిర్వహణ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 22 నుంచి 25 వరకు మాత్రమే సమావేశాలు జరుగుతాయన్నారు. ఇందులో పని దినాలు మూడు రోజులు మాత్రమేనని వివరించారు. శాసనసభ సమావేశాలు ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీస్ శాఖదే కీలక బాధ్యతగా గుర్తు చేశారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ, శాసనసభ సమావేశాలకు ముందు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కావడం అనవాయితిగా వస్తుందన్నారు. సభ సాఫీగా జరగడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజి తేజ్ దీప్ కౌర్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీకుమార్‌తో పాటు రాచకొండ, సైబరాబాద్ తదితర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
చిత్రం.. శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానుండటంతో భద్రతా ఏర్పాట్లపై
బుధవారం స్పీకర్ పోచారం అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం