రాష్ట్రీయం

ముఖ్యమంత్రిని కలసిన సాహస నారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 21: భారత యాత్ర సాహస నారి సంగీత శ్రీ్ధర్ గురువారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు. గుంటూరుకు చెందిన ఆమె తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో స్థిరపడి మహిళలకు స్ఫూర్తిగా ఒంటరిగా భారత దేశ యాత్ర చేస్తున్నారు. తన యాత్రలో భాగంగా ఆమె అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రిని కలిశారు. మహిళ అర్ధరాత్రి ఒంటరిగా ఇంటికి క్షేమంగా చేరినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ మాటలే స్ఫూర్తిగా తీసుకుని ఆయన 150వ జయంతిని పురస్కరించుకుని ఈ యాత్ర చేపట్టినట్లు వివరించారు. ఏపీలో అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్సు గురించి విని ఆసక్తితో ఇక్కడికి వచ్చానని ఆమె తెలిపారు. ఏపీలో మహిళలకు ముఖ్యమంత్రి అందిస్తున్న చేయూత దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ప్రశంసించారు.
గుండ్రేవుల వద్ద అదనపు రిజర్వాయరుకు గ్రీన్ సిగ్నల్
కర్నూలు జిల్లా గుండ్రేవుల గ్రామం వద్ద తుంగభద్ర నదికి సంబంధించి అదనపు రిజర్వాయరు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించింది. కోట్ల విజయభాస్కరరెడ్డి సుంకేశుల బ్యారేజీ సమీపంలో అదనపు రిజర్వాయరును 2890 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు జలవనరుల శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు పాలనా ఆమోదాన్ని మంజూరు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేశాక తదుపరి చర్యలు తీసుకునేందుకు నిర్ణయించింది.
సెలక్షన్ కమిటీ ఏర్పాటు: మెప్మా స్టేట్ మిషన్ మేనేజర్‌ను నియమించేందుకు వీలుగా సెలక్షన్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం గురువారం నియమించింది. కమిటీకి చైర్మన్‌గా పురపాలక శాఖ డైరెక్టర్, సభ్యునిగా ఏపీటిడ్కో ఎండీ, కన్వీనర్‌గా మెప్మా మిషన్ డైరెక్టర్ వ్యవహరిస్తారు.
ముగియనున్న ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం
రాష్ట్ర శాసన మండలికి సంబంధించి ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. ఈ విషయాన్ని గవర్నర్ కార్యాలయం అధికారికంగా గురువారం తెలియచేసింది. పదవీ కాలం ముగియనున్న వారిలో ఎమ్మెల్సీలు పి.నారాయణ, అంగూరి లక్ష్మీ శివ కుమారి, పి.శమంతకమణి, యనమల రామకృష్ణుడు, ఆదిరెడ్డి అపారావు ఉన్నారు. ఖాళీ అయిన ఐదు స్థానాలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరారు.
ఎన్నికల భద్రతా ఏర్పాట్ల సమీక్ష
రానున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన బలగాలను పంపే అంశంపై వివిధ రాష్ట్రాల డీజీపీలు, సీఎస్‌లతో ఢిల్లీ నుంచి కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీకి అవసరమైన కేంద్ర బలగాల గురించి డీజీపీ ఆర్‌పి ఠాకూర్ వివరించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కావాల్సిన బలగాలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి వివరాలు సేకరించారు. ఈ సమావేశంలో సీఎస్ అనిల్ చంద్ర పుణేఠా తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన భారత యాత్ర సాహస నారి సంగీత