రాష్ట్రీయం

1500 కోట్లతో కృష్ణపట్నం - ఓబులవారిపల్లె రైల్వే లైన్ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, ఫిబ్రవరి 21 : కృష్ణపట్నం - ఓబులవారిపల్లెకు 1500 కోట్లతో నూతన రైల్వే మార్గం నిర్మించారని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాళెం పంచాయతీ సరస్వతి నగర్ వద్ద కృష్ణపట్నం - ఓబులవారిపల్లె నూతన ( రెండో ) రైల్వే మార్గానికి గురువారం ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన పలు చిత్రాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో కలిసి పరిశిలించారు. ఈసందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మొదటి రైలు మార్గం ద్వారా కృష్ణపట్నం పోర్టు నుంచి రాయలసీమ ప్రాంతానికి ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయన్నారు. రెండో రైల్వే మార్గం ద్వారా నెల్లూరు నుంచి కడప తదితర రాయలసీమ ప్రాంతాలకు రాకపోకలు సులభం అవుతాయన్నారు. కృష్ణపట్నం - ఓబులవారిపల్లెకు కొత్త రైల్వే మార్గంతో ప్రజలకు ప్రయాణం చాలా సులువు అవుతుందన్నారు. ఆర్‌విఎన్‌ఎల్, రైల్వే బోర్డు అధికారుల చొరవతో కృష్ణపట్నం - ఓబులవారిపల్లెకు మొదటి రైల్వే లైను నిర్మాణ పనులు చివరి దశకు రావడం అభినందనీయమన్నారు. మార్చి నెలఖరుకు కృష్ణపట్నం పోర్టుకు రాయలసీమ నుంచి ఐరన్ ఓర్ రవాణా జరిగే అవకాశం ఉందన్నారు. నూతన రైల్వే మార్గం పూర్తయితే నెల్లూరు నుంచి కడప జిల్లా, రాయలసీమ ప్రాంతాలకు రాకపోకలకు ప్రయాణం చాలా సులువుగా మారుతుందన్నారు. ఈరైల్వే లైను మార్గమధ్యలో మొత్తం ఏడు రైల్వే స్టేషన్లు నిర్మితమడంతో ప్రయాణికులతోపాటు రైల్వే శాఖకు ప్రయోజనం ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ కృష్ణపట్నం నుంచి ఓబులవారిపల్లెకు 1500 కోట్లతో కొత్త రైల్వే మార్గం నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఈపనులు పూర్తయితే ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కృష్ణపట్నం నుంచి ఓబులవారిపల్లె మధ్య 72 కిలోమీటర్లు దూరం ప్రయాణం తగ్గుతుందన్నారు. మొదట్లో ఈ మార్గాన్ని కేవలం సరుకుల రవాణా కోసమే ఉద్దేశించామని, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన మేరకు ఈ మార్గంలో ప్యాసింజర్ రైళ్లను ప్రారంభిస్తామని రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ హామి ఇచ్చారు. సొరంగ మార్గాల పనులు కొంత మేర పూర్తి కావాల్సి ఉందని, పూర్తయిన వెంటనే ప్యాసింజర్ రైళ్లను ప్రారంభిస్తామని చెప్పారు. రైల్వే శాఖకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టగల ఈమార్గంలో రెండోవ లైను కూడా త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పొంగూరు నారాయణ, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవవేంద్ర రెడ్డి, నెల్లూరు నగర మేయర్ అబ్ధుల్ అజీజ్, తిరుపతి పార్లమెంట్ మాజీ ఎంపీ వరప్రసాద్, రైల్వే ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు.
చిత్రం..రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం