రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాలకు డిజిటల్ ఇండియా అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: పౌరులకు ఆన్‌లైన్ ద్వారా అత్యుత్తమ సేవలను అందించినందుకుగానూ ఏపీ, తెలంగాణకు కేంద్ర డిజిటల్ ఇండియా అవార్డులు అందజేసింది. వివిధ ప్రభుత్వ విభాగాలకు సమాచార, ఐటీ మంత్రిత్వశాఖ ప్రతి సంవత్సరం ఈ అవార్డులు ఇస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలూ తమ సత్తాను చాటాయి. ఢిల్లీలో హెబిటేట్ సెంటర్‌లో కేంద్ర సమాచార, ఐటీ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘డిజిటల్ ఇండియా అవార్డు-2018’ను ఆశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అందజేశారు. కేంద్ర ప్రభుత్వ వివిధ రాష్ట్రాల ప్రభుత్వం విభాగాలకు మొత్తం 35 అవార్డులను ప్రకటించాయి. అందులో ఆంధ్రప్రదేశ్‌కు మూడు, తెలంగాణకు మూడు అవార్డులు లభించాయి. భూ రికార్డులో పారదర్శకత పాటించినందుకు ఏపీకి బంగారు పతకం లభించింది. అవార్డును సీఆర్‌డిఏ కమిషనర్ చేరుకూరి శ్రీధర్ అందుకున్నారు. బెస్ట్ మొబైల్ యాప్ విభాగంలో(మీసేవా) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రజతం దక్కింది. అవార్డును మీసేవ డిప్యూటీ డైరెక్టర్ ముత్త రామస్వామి అందుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ వెబ్ పోర్టల్‌కు ప్రత్యేక అవార్డు దక్కగా శ్రీధర్ పోపురి దాన్ని అందుకున్నారు.
అలాగే సాంకేతిక సేవాలో పారదర్శకత పదర్శించిన జీహెచ్‌ఎంసీకి ఔట్ స్టాండింగ్ డిజిటల్ ఇనిషియేటివ్ బై లోకల్ బాడీ విభాగంలో ప్లాటినం అవార్డు లభించింది. ఈ అవార్డును కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నుంచి జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారి ముషారఫ్ అలీ ఫరుకీ అందుకున్నారు. ఉత్తమ మొబైల్ యాప్ విభాగంలో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన టీయాప్ ఫోలియాకు రజతం దక్కింది. అవార్డును జీటీ వెంకటేశ్వరరావు అందుకున్నారు. వెబ్ రత్న విభాగంలో మహబూబ్‌నగర్ జిల్లాకు బంగారు పతకం లభించింది. ఈఅవార్డును కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చేతుల మీదుగా ఆ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అందుకున్నారు. వీటితో పాటుగా విశాఖపట్నంలోని నాస్కామ్ కూడా ఒక అవార్డు లభించింది.
జీహెచ్‌ఎంసీకి అవార్డుల పంట
హైదరాబాద్: ఇటీవల కాలంలో జీహెచ్‌ఎంసీకి అవార్డుల పంట పండింది. గడిచిన రెండేళ్లుగా వరుసగా అవార్డును స్వీకరిస్తున్న జీహెచ్‌ఎంసీకి కేంద్ర ప్రభుత్వం మరో డిజిటల్ ఇండియా అవార్డు దక్కింది. ఈమేరకు బల్దియా అదనపుకమిషనర్ ముషారఫ్ అలీ శుక్రవారం డిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ ఇటీవలి కాలంలో అమలు చేస్తున్న ఆధునిక, సాంకేతిక సంస్కరణలు సత్ఫలితాలివ్వటం, పూణె స్థానిక సంస్థ మాదిరిగా డీపీఎంఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులను జారీ చేయటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ అమల్లో రాష్ట్రంలోనే ముందుస్థానంలో ఉన్నందున ఈ అవార్డు దక్కినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.