రాష్ట్రీయం

శ్రీవారి సేవలో రాహుల్‌గాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 22: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా శ్రీవారి ఆలయంలోకి వెళ్లిన రాహుల్ గాంధీకి టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఎలాంటి విరామ సమయం లేకపోవడం, సామాన్య భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకునే సమయం కావడంతో రాహుల్‌గాంధీ కూడా సామాన్య భక్తునిలా మహాలఘులో స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం హుండీలో కానుకలను సమర్పించారు. అనంతరం ధ్వజ స్తంభానికి నమస్కరించుకుని రంగనాయక మండపం చేరుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా జేఈఓ శ్రీనివాసరాజు ఆయనకు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు. రాహుల్ గాంధీ వెంట మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పరిశీలకులు ఊమెన్‌చాందీ, టీటీడీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కన్వీనర్ కనుమూరి బాపిరాజు, కేంద్ర మాజీ మంత్రి, టీటీడీ మాజీ చైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి, టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ తదితరులు ఉన్నారు. ఇదిలావుండగా శ్రీవారి దర్శనానంతరం జేఈఓ శ్రీనివాసరాజుకు రాహుల్‌గాంధీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాహుల్ కొంటె సైగలు : పులకించిన సభికులు
రేణిగుంట: రాహుల్‌గాంధీ తన కొంటె సైగలతో ప్రజలను పులకింపజేసిన దృశ్యం శుక్రవారం తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీ తారకరామా స్టేడియంలో అవిష్కృతమైంది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర తిరుపతికి చేరుకున్న సందర్భంగా రాహుల్‌గాంధీ భాగస్వాములయ్యారు. అటు తరువాత ఎస్వీయూ క్రీడామైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా రాహుల్‌గాంధీ ప్రసంగించడానికి మైక్ వద్దకు చేరుకున్నారు. మైక్‌ను సవరించుకుంటూ ప్రజల వైపు, మీడియా వైపు చూశారు. ఏమిజరిగిందో కాని రాహుల్‌గాంధీ సభకు హాజరైన ప్రజలను చూస్తూ.. నవ్వుతూ కనుబొమ్మలెగరేశారు. మీడియాను చూస్తూ కన్నుగీటారు. రాహుల్ ప్రసంగం సందర్భంగా మైక్‌లు ఎత్తుగా ఉండటంతో వేదిక ముందున్న కెమెరా, ఫోటో జర్నలిస్టులు మైక్‌ను దించమని రాహుల్‌గాంధీని కోరడంతో ఆయన ఇలా స్పందించారు. రాహుల్ సైగలతో సభకు హాజరైన యువకులు, ప్రజలు కూడా ఆనందంతో పులకరించారు. గత కొంతకాలం క్రితం పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా ప్రధాని మోదీని ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్‌గాంధీ, ప్రధానిని ఉద్దేశించి కనుసైగ చేయడం అటు తరువాత ప్రధాని కూర్చున్న స్థానం వద్దకు వెళ్లి ఆయన్ను ఆలింగనం చేసుకున్న దృశ్యాలు ఎస్వీయూ స్టేడియంలో గుర్తుకు వచ్చాయి.