రాష్ట్రీయం

శరవేగంగా పోలవరం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 22: పోలవరం ప్రాజెక్టు పనులు నిర్దేశిత లక్ష్యం మేరకు శరవేగంగా జరుగుతున్నాయి. కొత్త డీపీఆర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు మరింత ఊపందుకోనున్నాయి. ఈ నెల 11వ తేదీ వరకు పరిగణనలోకి తీసుకుంటే మొత్తం ప్రాజెక్టు 65.45 శాతం పూర్తయితే కేవలం హెడ్ వర్క్సు మాత్రం 55.96 శాతం పూర్తయింది. ఇప్పటి వరకు 91వ వర్చువల్ రివ్వ్యూ జరిగింది. మెయిన్ డ్యామ్ ప్యాకేజీలో 55.54 శాతం పూర్తి కాగా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, లెఫ్ట్ ప్లాంక్ మట్టి తవ్వకం పనులు 81.90 శాతం పూర్తయ్యాయి. 11వ తేదీ వరకు పరిశీలిస్తే మొత్తం ప్రాజెక్టు 65.45 శాతం పూర్తయితే కేవలం హెడ్ వర్క్సు మాత్రం 55.96 శాతం పూర్తయింది. ఇప్పటివరకు 91వ వర్చువల్ రివ్వ్యూ జరిగింది. మెయిన్ డ్యామ్ ప్యాకేజీలో 55.54 శాతం పూర్తికాగా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, లెఫ్ట్ ప్లాంక్ మట్టి తవ్వకం పనులు 81.90 శాతం పూర్తయ్యాయి.
ఇక కాంక్రీటు విషయానికొస్తే స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్ కలిపి మొత్తం 66 శాతం పూర్తయింది. నిర్ధేశిత ప్రమాణాల ప్రకారం, వారం వారం లక్ష్యం మేరకు కాంక్రీటు పని, మట్టి తవ్వకం పూర్తవుతోంది. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 62.75 శాతం వరకు పూర్తి కాగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఇప్పటికే పూర్తయిన విషయం విదితమే. అలాగే జెట్ గ్రౌటింగ్ కూడా పూర్తయింది. ఇపుడు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం జరుగుతోంది. నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయ చర్యల మధ్య ఈ పనులు జరుగుతున్నాయి. వరద సమయానికి లక్ష్యాన్ని దాటుకుని పనులు పూర్తయ్యే విధంగా వారం వారం సమీక్షిస్తున్నారు. ఈ పనులు వరద సమయానికి పూర్తయితేనే డిసెంబర్ నాటికి గ్రావిటీపై నీటిని అందించే అవకాశం ఉంటుంది. అయితే ఎగువ కాఫర్ డ్యామ్ 21.22 శాతం, దిగువ కాఫర్ డ్యామ్ 4.06 శాతం పూర్తయింది. మొత్తం కనెక్టవిటీల ప్యాకేజీలకు సంబంధించి 60.54 శాతం పూర్తి కాగా ఎడమ కనెక్టవిటీలు 48.44 శాతమే పూర్తయింది. కుడి కనెక్టవిటీలు 74.17 శాతం వరకు అయ్యాయి. ఇక కుడి ప్రధాన కాల్వకు సంబంధించి 90.09 శాతం పూర్తికాగా, ఎడమ ప్రధాన కాల్వ కేవలం 68.17 శాతం వరకు జరిగింది.
స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ చానల్, లెఫ్ట్ ప్లాంక్‌కు సంబంధించి సవరించిన డిజైన్ల మేరకు 1169.56 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం జరగాల్సివుంది. ఇప్పటి వరకు 957.89 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు అయ్యాయి. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్ కాంక్రీటుకు సంబంధించి 36.79 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పోయాల్సివుంది. ఇప్పటి వరకు 24.27 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు జరిగింది. మిగిలిన పనుల కాంక్రీటు పోతకు వారం వారం లక్ష్యాన్ని నిర్ధేశించారు. కుడి ప్రధాన కాల్వకు సంబంధించి మొత్తం కాల్వ పొడవు 177.9 కిలోమీటర్లు కాగా అందులో 176.20 కిలోమీటర్ల వరకు లైనింగ్ చేయాల్సివుంది. ఇప్పటి వరకు 157.563 కిలోమీటర్ల వరకు లైనింగ్ అయ్యింది. ఎడమ ప్రధాన కాల్వ పొడవు మొత్తం 211.379 కిలోమీటర్లు కాగా అందులో 211.379 కిలోమీటర్లు లైనింగ్ చేయాల్సివుంది. అయితే ఇప్పటి వరకు 126.548 కిలోమీటర్లు మాత్రమే లైనింగ్ అయింది. కుడి ప్రధాన కాల్వ పరిధిలో 255 స్ట్రక్చర్లు నిర్మించాల్సివుండగా ఇప్పటివరకు 205 స్ట్రక్చర్లు పూర్తయ్యాయి. ఎడమ ప్రధాన కాల్వ పరిధిలో మొత్తం 453 స్ట్రక్చర్లు నిర్మించాల్సివుంది. ఇప్పటి వరకు కేవలం 155 స్ట్రక్చర్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇక భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ విషయానికొస్తే రూ.7,757.08 కోట్లు ఇవ్వాల్సివుంది. ఇప్పటి వరకు రూ.4,731 కోట్ల వరకు చెల్లించారు. ఇంకా రూ.3వేల 25 కోట్ల వరకు చెల్లించాల్సి వుంది. ఏదేమైనప్పటికీ సవరించిన డిపీ ఆర్ మొత్తం అన్ని విభాగాల్లోనూ ఈ నెలాఖరుకల్లా ఆమోదం పొందితే పనులు మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి.