ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణలో ఉన్నది మా ప్రభుత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 3: ‘తెలంగాణలో ఉన్నది మా ప్రభుత్వమే, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, అక్కడి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మా పార్టీ వారే, పార్టీ పేరు మాత్రమే మారింది, కానీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీయే’.. ఇదీ తెలుగుదేశం పార్టీ ఎపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు అభిప్రాయం. ఆదివారం విజయనగరం పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లా పరిషత్ అతిధిగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోజుకు 16 గంటలపాటు పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. మంత్రివర్గ సహచరుల పనితీరు సరిగా లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేయటాన్ని విలేఖరులు ప్రస్తావిస్తూ పార్టీ అధ్యక్షునిగా ఆయన అభిప్రాయాన్ని కోరగా కిమిడి సమాధానమిస్తూ మంత్రులు కూడా బాగానే పనిచేస్తున్నారన్నారు. మంత్రులు జిల్లాల పర్యటనకు ఎక్కువగా రాలేదంటే ప్యూయల్ ఖర్చులు తగ్గి రాష్ట్రానికి ఖర్చు తగ్గినట్లేగా అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిడిపిలోకి చేర్చుకోవడాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు ఆదర్శంగా తీసుకుంటున్నారా అని ప్రశ్నించగా ‘తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉంది? ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, అక్కడి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మావారే, అక్కడ ఉంది మా ప్రభుత్వమే, కానీ పార్టీ పేరు మాత్రం మారింది’ అని వ్యాఖ్యానించారు. వైకాపా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపును రాష్ట్భ్రావృద్ధి కోసం అందరినీ కలుపుకునే పోయే చర్య అని చెప్పారు. జగన్ మాటతీరు, పనితీరు సరిగా లేక ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు దూరం అవుతున్నారన్నారు. పునర్విభజన చట్టం కింద రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. పెరిగిన స్థానాల్లో ముందునుంచి పార్టీలో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆ తరువాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. కిందిస్థాయి ఉద్యోగులకు జీతాలు పెంచడానికి డబ్బులు లేవంటున్న ప్రభుత్వం ఎమ్మెల్యేలకు భారీగా వేతనాలు పెంచటంపై స్పందిస్తూ ధరల సూచి ప్రకారం వేతనాల పెంపు జరిగిందన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షనాయకుడు ఏమి చెప్పారో తెలుసుకోవాలని సలహా ఇచ్చారు.

విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ జగదీష్, ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, కెఎ నాయుడు, జడ్పీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, పార్టీ నాయకులు భంజ్‌దేవ్, ఐవిపి రాజు తదితరులు పాల్గొన్నారు.

మహా విశాఖ ఎన్నికలకు టిడిపి మోకాలడ్డు!

మేయర్ స్థానంపై బెట్టు
తమకే అంటున్న బిజెపి

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 3: మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలకు అధికార తెలుగుదేశం మోకాలడ్డుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్లుగా ఎన్నికల నిర్వహణపై కాలయాపన జరుగుతూ వస్తోంది. టిడిపి అధికారంలోకి వచ్చాక ఎన్నికలు జరుగుతాయని భావించినా ఆ సూచనలు కనిపించడం లేదు. నగరంలో పట్టుసాధిస్తున్న బిజెపి మేయర్ స్థానాన్ని కోరుకుంటోంది. ఇదే టిడిపి నేతలకు మింగుడు పడడం లేదు.
‘మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) ఎన్నికలకు ఇంకెన్నాళ్లు పడుతుంది. అసలు ఎన్నికలు ఎందుకు నిలిచిపోయాయి. విలీన పంచాయతీలు ఎందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అడ్డంకులు తొలగించే అవకాశం ఉన్నా అధికార పార్టీ ఎందుకు వౌనంగా ఉంది’. విశాఖ ప్రజల మదిని తొలిచేస్తున్న సవాలక్ష ప్రశ్నలివి. జివిఎంసికి పాలకవర్గం లేక ఇప్పటికి నాలుగేళ్లయింది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో పదవుల పందేరాన్ని పూర్తి చేయని పార్టీ అధిష్ఠానంపై అసహనంతో ఉన్న కేడర్ కనీసం జివిఎంసి ఎన్నికల్లోనైనా తమకు పోటీ చేసే అవకాశం దక్కుతుందని ఆశగా ఎదురు చూశారు. అయితే ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఎన్నికలకు వెళ్తే అధికార తెలుగుదేశంతో మైత్రీ సంబంధాన్ని కొనసాగిస్తున్న బిజెపికి కూడా సీట్లను కేటాయించాల్సి ఉంది. గత సాధారణ ఎన్నిలకు ముందు బిజెపితో అవగాహన కుదుర్చుకున్న తెలుగుదేశం, విశాఖ పార్లమెంట్‌తో పాటు నగర పరిధిలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌ను కేటాయించింది. ఈ రెండు స్థానాల్లో బిజెపి అభ్యర్థులు గెలుపొందారు. దీంతో జివిఎంసి మేయర్ అభ్యర్థిత్వం తమకే ఇవ్వాలని కమలనాథులు పట్టుబడుతున్నారు. జివిఎంసికి పరోక్ష ఎన్నికలైతే సగం స్థానాలను కోరుతున్న బిజెపి, మేయర్ అభ్యర్థిత్వం తమకే కావాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ పదవిని బిజెపి దక్కించుకున్న సందర్భాన్ని ఆపార్టీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. ఇదే సందర్భంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించడం వెనుక బిజెపి ఆశలను అడ్డుకోవడమేనన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందే చరిష్మా, ఆర్థిక బలం ఉన్న నాయకులు ఆపార్టీలో లేరని, గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలుగుదేశం అభ్యర్థినే మేయర్‌గా మిత్రపక్షం అంగీకరిస్తుందని చర్చసాగుతోంది.
ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం వెనుక కారణం కూడా ఇదేనని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ మరో కోణాన్ని అటు తెలుగుదేశం, ఇటు బిజెపి వర్గాలు తెరపైకి తెస్తున్నాయి. బిజెపి నుంచి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకే ప్రత్యక్ష ఎన్నికల అంశాన్ని తెరపైకి తెస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.